వినాయక పూజలో భీమిలి వైసిపి ఇన్చార్జ్ మహేష్ - స్థానిక వైసీపీ నేత హనుమంతు.

 మధురవాడ--- ప్రజాబలం న్యూస్--- మధురవాడ 5 6 7 వార్డులలో వినాయక నవరాత్రి ఉత్సవాలు పరిష్కరించుకొని బుధవారం రాత్రి వినాయక నిమజ్జనం ఉత్సవాలు ఘనం


గా జరిగాయి. మిథిలాపురి ఉడా కాలనీ,పాత మధురవాడ మెట్ట, ఎం పాలెం పోలీస్ స్టేషన్ వద్ద గల వినాయక మండపం తదితరి ఏరియాలలో అన్న సమారాధనలు ఘనంగా జరిగాయి.భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. పీఎం పాలెం పోలీస్ స్టేషన్ వద్ద 96 ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఏటా లాగే భీమిలి వైసీపీ ఇంచార్జ్ ముత్తం శెట్టి మహేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని అన్న దాన కార్యక్రమం ప్రారంభించారు ముందుగా వినాయక పూజ చేశారు..ఈ సందర్భంగా నిర్వాహకులను ఆయన అభినందించారు. అనంతరం మహేష్ కు స్థానిక మాజీ కార్పొరేటర్ పోతిన హనుమంతరావుకు సత్కారం చేశారు.