పేదలకు రక్ష --- జగనన్న ఆరోగ్య సురక్ష--- మాజీ మంత్రి భీమిలి అవంతి శ్రీనివాస్
మధురవాడ--- ప్రజాబలం న్యూస్ --
భీమిలి నియోజకవర్గం - జీవియంసి (4 5,6,7,8 వార్డు లు) - శని వారం
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మధురవాడ పిహెచ్సి ఆవరణలో ఘనంగా ప్రారంభమైంది.
ఈ సందర్భంగాఅవంతి జ్యోతి ప్రజ్వలన చేసి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభించారు. శిబిరం లో ఏర్పాటు చేసిన వివిద రకాలైన స్టాల్స్ లను పరిశీలించారు.
వైద్య శిబిరంలో డాక్టర్లచేత వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వచ్చిన రోగులకు మనో దైర్యం అవంతి చెప్పి వారికి జగనన్న ఉన్నాడని ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యేఅవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి నుంచి 45 రోజులు వరుకూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఓ యజ్జం లా పట్టణ, పల్లే ప్రాంతాలు లో జగనన్న ఆరోగ్య సురక్ష ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వాడ వాడలా ప్రతీ ఇంటికి వైద్యం అందాలన్నదే ఆయన అంతిమ లక్ష్యం అని,అందులో భాగంగా ప్రతీ ఇంటిని జల్లెడ పట్టి జనం ఆరోగ్య సమస్యలు తెలుసుకోవడం కోసం వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రతీ ఇంటికి వెళ్ళి అనారోగ్యం తో బాధపడుతున్న వారి సమస్యలు తెలుసుకొని వాటికి ఉచిత వైద్య శిబిరం లో చికిత్స అందించడం జరుగుతుందని',జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రతీ పేదవాడికి ప్రతీ ఇంటికి ఉచిత వైద్యం అందాలన్నదే అని, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈజగనన్న సురక్ష క్యాంపులలో 45 రోజులు వ్యవధిలో 5,000 వేలు మందికి పైగా వైద్యులు 1.67 కోట్ల కుటుంబాలను కవర్ చేస్తూ, 14 రకాల డయాగ్నొస్టిక్ కిట్స్ 172 రకాల మందులతో 10,574 ఉచిత ఆరోగ్య సురక్ష క్యాంపులను నిర్వహిస్తామని చెప్పారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇంత చక్కని కార్యక్రమం కి శ్రీకారం చుట్టడం పట్ల ముఖ్యమంత్రి జగన్ కి పేద ప్రజలు పట్ల ఆయనకు ఉన్న ప్రేమ కు నిదర్శనం అని,ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ని నాయకులు ,వైద్య సిబ్బంది , ఆశా వర్కర్లు - వాలంటీర్లు - ఇలా ప్రతీ ఒక్కరు భాద్యత గా తీసుకుని విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం వైద్య శిబిరం లో వైద్య పరిక్షలు చేయించుకున్న వారికి అవంతి చేతులు మీదుగా కంటి అద్దాలు - మందుల, క్వి ట్లు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ రావు అందిస్తున్న సేవలను కొనియాడి ఆయనకు సన్మానం చేశారు. జోనల్ కమిషనర్ కే కనకమహాలక్ష్మి -రాష్ట్ర నగరాల కార్పొరేషన్ చైర్మన్ సుజాత సత్యనారాయణ,మాజీ కార్పొరేటర్ పోతిన హనుమంతరావు, 7వ వార్డు వైసిపి అధ్యక్షుడు పోతిన శ్రీనివాసరావు , సింహాచలం దేవస్థానం డైరెక్టర్ పిల్ల కృష్ణమూర్తి పాత్రుడు, పిల్లా సూరిబాబు, అల్లాడ లింగేశ్వరరావు,వాండ్రాసి రవికుమార్, ఎం.వి రమణమూర్తి, పిల్లా రమణ,బంగారు ప్రకాష్,. అధికారులు - ప్రభుత్వ వైద్యులు - వైద్య సిబ్బంది - వార్డు కార్పోరేటర్ లు - వార్డు ఇంచార్జ్ లు - వార్డు ప్రెసిడెంట్ లు - సచివాలయం లు గృహ సారథులు కార్యకర్తలు - ప్రజలు పాల్గొన్నారు.

