అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు --- అన్న సమారాధన.

 మధురవాడ----


ప్రజాబలం న్యూస్ ---జీవిఎంసి జోన్ 2 పరిధి 6వ వార్డు కొమ్మాధీ అంజలి గీతాంజలి టవర్స్ అపార్ట్మెంట్ అవరణలో వినాయక చవితి నవరాత్రుల్లో భాగంగా ఆదివారం అపార్ట్మెంట్ వాసులు పలు సాంస్కృతిక కార్యక్రమాలుతో అలరించి ,ఘనంగా భారీ అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులు అలరించిన సాంస్కృతిక నృత్యాలు ,గణేషుని శ్లోకాలు ,పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. వినాయకుని వేషాధారుని చుట్టూ మహిళలు కోలాటం ఆద్యంతం కనువిందుగా గణేశుని ఆరాధించారు .వక్తలు మాట్లాడుతూ అన్ని దానాలలోకెళ్ల అన్నదానం మహాదానమని, ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలు పంచుకోవడం సంతోషంగా ఉందనిపేర్కొన్నారు. ఆధ్యాత్మిక భావంతో మానసిక శక్తి సిద్ధించడంతో పాటు సేవా దృక్పథం అలవడుతుందని తద్వారా స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందన్నారు. వినాయక చవితి నవరాత్రులు ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో జరుపుకుంటూ లోక క్షేమం కోసం పూజలు, అన్నదానాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఆ గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు.