మధురవాడ శిల్పారామo లో ఉర్రూత లూగించిన శాస్త్రీయ జానపద నృత్యాలు.

 మధురవాడ--- ప్రజాబలం న్యూస్---- మధురవాడ శిల్పారామం జాతర లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల భాగంగా ఏపీ భాషా సాంస్కృతి శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన శాస్త్రీయ జానపద నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. హర హర మహాదేవ, మొక్కజొన్న తోటలో తదితర పాటలకు


నగరానికి చెందిన కళాకారులు నృత్య దర్శకత్వం సిహెచ్ మహాలక్ష్మి వహించగా రిషిత, హర్షిత, శ్రావణి, విజయలక్ష్మి, ప్రియాంక, సాత్వి, యశస్విని, తదితర చిన్నారులు ప్రదర్శనలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. శిల్పారామం అధికారి విశ్వనాథరెడ్డి పర్యవేక్షించారు.