మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బయటకు రావాలని ఆనందపురం మండలం రామాలయంలో ప్రత్యేకమైన పూజలు -- పోరాటంతో భీమిలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పట్టు బిగిస్తున్న కోరాడరాజబాబు.

 భీమిలి నియో


జకవర్గం-- ప్రజాబలం న్యూస్--- తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్దోషిగా బయటకు రావాలని కోరుకుంటూ మంగళవారం భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలో రామాలయ దేవాలయంలో భీమిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు ప్రత్యేక పూజలు చేశారు. విశాఖ పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మీసాల సత్యనారాయణ సీనియర్ నాయకులు శ్రీనాథ నారాయణరావు, నియోజకవర్గం వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు కొట్టియాడ రెడ్డి బాబు, ఎంపీటీసీ రమాదేవి,కర్రోతి సత్యనారాయణ, కొట్టాడ సత్యమూర్తి, కొట్టియాడా లక్ష్మణ్ మూర్తి, బంటుపల్లి వెంకట్రావు, బంటుపిల్ల అప్పారావు, చిన్ని రాజేష్ కుమార్, లంకలపల్లి నరసింహమూర్తి, తదితరులు పాల్గొన్నారు.