భీమిలి నియోజకవర్గం - ప్రజాబలం న్యూస్ -- ఆనందపురం మండలం (తర్లువాడ పంచాయతీ ) - సచివాలయం కోడ్ 10390287 - 13-10-2023 - శుక్ర వారం
తర్లువాడ పంచాయతీ లో మొదటి రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగాతర్లువాడ పంచాయతీ లో రెండవ రోజు పర్యటన కు విచ్చేసిన మాజీమంత్రి భీమిలి ఎమ్మెల్యేఅవంతి శ్రీనివాసు రావుకిడీజే మ్యూజిక్ లతో పూల వర్షం తో జై జగన్ జై అవంతి నినాదాలు తో అడుగడుగునా ప్రజలు నాయకులు యువకులు అభిమానులు ఘన స్వాగతం పలికారు.
ఇందులో భాగంగా బాగంగా అవంతి తర్లువాడ పంచాయతీ లో రెండవ రోజు (12 క్లస్టర్ లు) 703 ఇళ్ళు గడప గడపకు వెళ్ళి ఈ నాలుగేళ్ళలో వైసిపి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు అమలు పాలన పై వివరించి ప్రజలు అబిప్రాయం తెలుసుకున్నారు.
అనంతరం అవంతి మాట్లాడుతూ
గత ప్రభుత్వాలు మిమ్మల్ని కేవలం ఓటు బ్యాంకు గానే చూసాయని వైసిపి ప్రభుత్వ పాలనలో దళారీ వ్యవస్థ అనేది లేకుండా నేరుగా ప్రజలకే పాలన అందించి గాందీజీ కలలు కన్న స్వరాజ్యం తీసుకువచ్చారని జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే నే ఈ వాలంటీర్ లు ద్వారా పాలన మీ గడప గడపకు అందుతుంది లేదంటే గత ప్రభుత్వాలు లా గంటలు గంటలు ప్రభుత్వ అధికారులు కార్యాలయాలు చుట్టూ తిరిగే పరిస్దితి వస్తుంది కనుక జగనన్న అందించే సుపరిపాలన కావాలి అంటే రాబోయే ఎన్నికల్లో ప్యాన్ గుర్తు పై ఓటేసి భీమిలి లో నన్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
స్థానిక వైసీపీ సీనియర్ నేత
బిఆర్బి నాయుడు మాట్లాడుతూ ఈ నాలుగు ఏళ్ళలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తోడ్పాటు తో మన నియోజకవర్గం యంయల్ఏ అవంతి మన పంచాయతీ లో చాలా సమస్యలు పరిష్కారం చేసారని అభివృద్ధి పనులు కు శ్రీకారం చుట్టారని మీరంతా రాబోయే ఎన్నికల్లో ఆయనకు మద్దతు గా నిలిచి గెలిపించి మరింత సేవలు అందించే అవకాశం కల్పించాలని స్థానికులను కోరారు.
మరో సీనియర్ నేత మజ్జి వెంకట్రావు మాట్లాడుతూ మండల యంపిపి పదవి మన పంచాయతీ కి అవంతి ఇవ్వడం తో పాటు పంచాయతీ అభివృద్ధి లో ఎంతో తోడ్పాటు అందించారని రాబోయే దినాల్లో ఆయన చొరవతో ఇరువురం కలిపి మరింత అభివృద్ధి చేసి మళ్ళీ అవంతి ని గెలిపించుకుంటాం అని పేర్కొన్నారు.
బిసి కోలనీ - కోరాడ వీది - సబ్ సెంటర్ - ఎగువ పేట - సంతకం పట్టు - బిఆర్బి కోలనీ లలో దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అవంతి గారు అడగగా ఆయన దృష్టిలో పెట్టిన సమస్యలు
తర్లువాడ పంచాయతీ లో ఇంటింటి కొళాయిలు నిర్మాణం చేపట్టాలని.
కోరాడ వీది లోసిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని
డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేపట్టాలని
హైస్కూల్ ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని
బిసి కోలనీ లోడ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేపట్టాలని
సిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని
చేతి బోరు వేయాలని
తర్లువాడ లో అల్లం గుడ్డు కల్లాలు కోలనీ కల్వర్టు నిర్మాణం చేపట్టాలని
సమస్యలు విన్న అవంతి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులు కు ఆదేశాలు ఇచ్చారు.
సమస్యలు పరిష్కారం కై శ్రీకారం చుట్టిన అవంతి కి స్థానికులు సంతోషం తో దన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు - మండలం వైసిపి శ్రేణులు - సచివాలయం సిబ్బంది వాలంటీర్లు - సచివాలయం కన్వినర్ లు గృహ సారథులు కార్యకర్తలు పాల్గొన్నారు.

