జాతర వాకర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు బావి శెట్టి కి సన్మానం.

 విశాఖపట్నం-- ప్రజాబలం న్యూస్ -- ఇంటర్నేషనల్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సాంకేతిక వి


ద్యాసంస్థల అధినేత ఎస్ రవీంద్ర అధ్యక్షతన ఆదివారం విశాఖ నగరంలోని మురళి నగర్ లో గల వర్మ కాంప్లెక్స్ లో 2023 మహాత్మా గాంధీ ఫెల్లో సమావేశం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న వాకర్స్ అసోసియేషన్ లు పాల్గొన్నాయి. మధురవాడ శిల్పారామం జాతర వాకర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు బావిశెట్టి సత్యనారాయణకు ఘన సన్మానం నిర్వహించారు. వాకర్స్ క్లబ్ జిల్లా అధ్యక్షులు ఏ శుభ, ప్రస్తుత వాకర్స్ అసోసియేషన్ జాతర అధ్యక్షులు ప్రభాకర్ రాజు కోర్ కమిటీ మెంబర్లు,ఈ సందర్భంగా వాకర్స్ క్లబ్ సేవలు కొనియాడారు. మరింత ముందుకు సాగాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు..