కార్యకర్తలే నా బలం --- కార్యకర్తలే నా ధైర్యం-- వచ్చే ఎన్నికల్లో విజయడంకా మోగించాలి-- పిలుపునిచ్చిన భీమిలి ఎమ్మెల్యేఅవంతి

 వచ్చే ఎన్నికల్లో జగనన్నే మళ్లీ ముఖ్యమంత్రిగా విజయ డంకా మ్రోగించాలి ---- వైసీపీకి కార్యకర్తలే పట్టుకొమ్మలు-- యువత సైనికుల్లా పని చేయాలి --- 100 సచివాలయాలు గడప గడప మన ప్రభుత్వం పూర్తి.-- విజయోత్సవంలో అవంతి.


భీమిలి నియోజకవర్గం - ఆనందపురం-- (ప్రజాబలం న్యూస్ ) మండలం (పెద్దిపాలెం) ఆదివారం



రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం భీమిలి నియోజకవర్గం లో అవంతి శ్రీనివాసరావు 100 సచివాలయాలు గడప గడపకు మన ప్రభుత్వం పర్యటనపూర్తి చేసుకున్న సందర్భంగా పెద్దిపాలెం చెన్నా ఫంక్షన్ హాలు లో అవంతి ఆధ్వర్యంలో మూడు జిల్లాల కో ఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి భీమిలి నియోజకవర్గం పరిశీలకులు పసుపులేటి బాలరాజు ముఖ్య అతిథులు గా నియోజకవర్గ స్థాయి వైసిపి శ్రేణులు తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్త నాయకులకు అభినందించి సన్మానాలు చేశారు.

 ఇందులో బాగంగా అతిథులకు వైసిపి శ్రేణులు ఘనంగా సాదర స్వాగతం పలికారు.



 ముందుగా అతిథులు వైయస్ రాజశేఖరరెడ్డివిగ్రహం కి పూల మాలలు వేసి సుమాంజలి ఘటించి జ్యోతి ప్రజ్వలనచేశారు.


 అనంతరం పెద్దాయనవైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ప్రజలను కేవలం గెలిపించే ఓటు బ్యాంకు గానే చూసాయని,ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చకుండా వారి స్వలాభం కోసం చూసుకుంటే, వైసిపి ప్రభుత్వం పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మెనుప్యాస్టో ను బైబిల్, భగవద్గీత,ఖురాన్ లా భావించిఇచ్చిన, హామీలతో పాటు ఇవ్వని వాటిని 98 శాతం పూర్తి చేసి పేదల కళ్ళల్లో ఆనందం చూసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని,ఆయన పాలనలో వివక్ష చూపకుండా లంచం లేకుండా సేవలు అందిస్తున్నారని, పేదలకు మంచి చేయడానికి కావల్సింది పెద్ద వయసు అనుభవం కాదు, పెద్ద మనసు ఉండాలని అది ముఖ్యమంత్రి జగన్ కి ఉందని,సంక్షేమం అభివృద్ధి ఆయనకు రెండు కళ్ళు లాంటివి అని, చంద్రబాబు ను ఆయన దత్తు పుత్రుడు పవన్ కళ్యాణ్ ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని,ప్రజలంతా వైసిపి వెంటే ఉన్నారని రాబోయేది వైసిపి ప్రభుత్వం అని,అవంతి ఎప్పుడు జగన్ ని కలిసినా భీమిలి నియోజకవర్గం అభివృద్ధి కోసమే మాట్లాడే వారని,అవంతి ని రాబోయే ఎన్నికల్లో భీమిలి లో గెలిపించుకునే బాధ్యత మీదే అని చెప్పారు. ఎమ్మెల్యే

అవంతి మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలు తోడ్పాటు తో భీమిలి నియోజకవర్గం లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం దిగ్విజయంగా 100 సచివాలయాలు పూర్తి చేయడం జరిగిందని,పర్యటన లో గుర్తించిన సమస్యలను చాలా వరుకూ పరిష్కారం చేయడం జరిగిందని, నియోజకవర్గం లో ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, కణమాం పంచాయతీ లో ఎంఐఎం పార్కు ,గోరింట గ్రామంలో ఎక్సైజ్ శాఖ గోడాన్ తీసుకురావడం జరిగిందని, ఎంఐఎం పార్కు వేస్తె చాలా అభివృద్ధి చెందుతుంది అని, ఎవ్వరు నిలబడినా నేను పోటీ చేసి మీ అందరి తోడ్పాటు ప్రజలు దీవెనలతో గెలిచి మంచి సేవలతో మరింత అభివృద్ధి పథంలో నడుపుతానని నా బలం మీరే అని నా దైర్యం కార్యకర్తలే అని వారిలో ఉత్సాహం నింపారు.


అనంతరం 100 సచివాలయం పూర్తి అయిన సందర్భంగా వైవి సుబ్బారెడ్డి అవంతి కేకు కటింగ్ చేసి శిలాఫలకం స్థాపించారు.


 ఈ కార్యక్రమంలో - మూడు జిల్లాల యువజన విభాగం అధ్యక్షులు ముత్తంశెట్టి శివ నందీష్ బాబు - భీమిలి నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జ్ ముత్తం శెట్టి మహేష్ వైసిపి నాయకులు శ్రావణ్ కుమార్, మాజీ కార్పొరేటర్ పోతిన హనుమంతరావు, 7వ వార్డు వైసిపి అధ్యక్షులు పోతిన శ్రీనివాసరావు, ఆరువ వార్డ్ వైసీపీ అధ్యక్షుడు బి అప్పలరాజు , 7వ వార్డు వైసిపి మహిళా అధ్యక్షురాలు చేకూరి రజిని, సింహాచలం దేవస్థానం డైరెక్టర్ లు పిల్లా కృష్ణమూర్తి పాత్రుడు, పిల్ల సూరిబాబు ఎంవి రమణమూర్తి, సింహాచలం దేవస్థానం డైరెక్టర్ రాజేశ్వరి , మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ జె ఎస్ రెడ్డి,భీమిలి నియోజకవర్గం వైసిపి శ్రేణులు - సచివాలయం కన్వినర్ లు గృహ సారథులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.