భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో తేదీ 29.07.2026 , బుధవారం నాడు *గురు పౌర్ణమి* *మహోత్సవం* సందర్భంగా శ్రీ సత్యసాయి భజన మండలి,ఎండాడ నందు ఉదయం ఓంకార సుప్రభాత నగర సంకీర్తనలు తో ప్రారంభమై, షిరిడి సాయినాధుని, శ్రీ సత్యసాయి బాబా వారి పాలరాతి విగ్రహములకు, వెండి విగ్రహములకు, స్వామి వారి వెండి పాదుకులకు భక్తులందరూ వారి స్వహస్తములతో క్షీరాభిషేకము గావించినారు. తదుపరి మందిరం నందు సేవలందిస్తున్న , వేదం గురువులకు, బాలవికాస్ గురువులకు, రిటైర్డ్ టీచర్లకు కండవులతో సత్కరించి , స్వామి వారి ఫోటో, విభూది మరియు స్వీట్లు ఇవ్వడం జరిగింది. భజన మండలి కన్వీనర్ వెంకట రామకృష్ణారావు మాట్లాడుతూ ఈ గురువులకు చేసిన సత్కారం వారికి మరింత బాధ్యతను పెంచిందని, దాన్ని సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.తదుపరి షిరిడి సాయి హారతి, పర్తి సాయి హారతి ఇచ్చిన అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేపట్టి కార్యక్రమం ముగింపు చేయడం జరిగింది .సాయంత్రం కార్యక్రమంలో భాగంగా వేద పఠనం ,అష్టోత్తర శతనామార్చన,నామ సంకీర్తన అనంతరం శ్రీ సత్యసాయి విద్యా విహార్ గణిత శాస్త్ర అధ్యాపకులు, ప్రత్యేకించి స్వామి దివ్య ఆశీస్సులు పొందిన శ్రీ బగ్గాం సురేష్ కుమార్ గారిచే నిర్వహింపబడిన ఆధ్యాత్మిక ప్రసంగం భక్తులను ఆకట్టుకునే విధంగా,స్వామి వారు చిత్రపటం పై నుండి పూల వర్షం కురిపించే విధంగా కొన సాగించినారు. భగవంతుడి పై అచంచల భక్తి,విశ్వాసం కలిగి ఉండి మానవుడు తలపెట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుందని . పక్షులు ఎగరడానికి రెండు రెక్కలు ఎంత అవసరమో అదే విధంగా మానవుడు ఎదగడానికి నామ సంకీర్తన ,సేవ అనే రెండు కార్యక్రమాలు ప్రధానమని శ్రీ సత్యసాయి బాబా వారు అభివర్ణించేవారని తెలియచేశారు.శ్రీ సత్య సాయి సంస్థలు అభివృద్ధి పథంలోకి వెళ్లేందుకు స్వామి వారు సూచించిన క్రమశిక్షణ లు పాటించాలని మరొక సారి గుర్తు చేశారు.తన ప్రసంగం అనంతరం భజన మండలి కన్వీనర్ మందిరం ఇన్చార్జ్ కృష్ణారావు,అప్పలనాయుడు మాస్టారు ,సభ్యులు సూర్య ప్రకాశరావు, గోపి లు సాలువతో సత్కరించి స్వామివారి చిత్రపటం, విభూది, ఫ్రూట్స్, మిఠాయి బహుకరించి స్వామి వారికి హారతి తో కార్యక్రమం ముగింపు చేసినారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక ఇంచార్జి రామచంద్రరావు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
విశాఖ సిటీ సమితి ఎండాడ సత్యసాయి మందిరంలో ఘనంగా గురు పౌర్ణమి ఉత్సవం. ప్రత్యేక పూజలు. బాలవికాస్ గురువులకు, ఉపాధ్యాయులకు, మందిరంలో సేవకులకు పలువురు గురువులకు ఘన సన్మానం. భగవాన్ శ్రీసత్యసాయి దివ్య ఆశీస్సులతో ఎండాడ సత్యసాయి మందిరం కన్వీనర్ ఏవి రామకృష్ణారావు (ఏవీఆర్ ) ఆధ్వర్యంలో విస్తృత సేవ.
July 29, 2026
ఓం శ్రీ సాయిరాం.(. 🙏ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ🙏)