భీమిలి నియోజకవర్గం --మధు
రవాడ-- ప్రజాబలం న్యూస్ - జీవీఎంసీ 8వ వార్డు పరిధి సప్తగిరి కాలనీలో వెలసియున్న మహాశివ కుటుంబ ఆలయ ప్రాంగణంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త పి కాశీ రావు ఆధ్వర్యంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈనెల 15 నుండి ప్రారంభమైన ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గురువారం చండీ హోమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ధర్మకర్త కాశి రావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు లక్ష్మీనారాయణ బృందం పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈనెల 25బధవారం వరకు ఉత్సవాలు జరుగుతాయని,. ప్రతి ఏటా మాదిరిగానే పోలీస్ శాఖ వారిచే అన్నన ప్రసాద వితరణ జరుగుతుందని చెప్పారు. అమ్మవారి ఊరేగింపు నిమర్జజనం, సాగర సంగమం నందు జరుగును అని తెలిపారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఉమామహేశ్వరరావు, పి ప్రసాద్, పి సూర్యనారాయణ, నాని, అంజన దేవి, శ్రీ లక్ష్మీ, అప్పారావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

