మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు ఖండిస్తూ--- అలుపెరగని నిరసనలు తెలియజేస్తున్న-భీమిలి తెలుగు తమ్ముళ్లు

 27 వ రోజు నిరాహార దీక్షా శిబిరాన్ని నిర్వహించిన భీమిలి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి కోరాడ రాజబాబు.--- భీమిలి నియోజకవర్గం--- ప్రజాబలం న్యూస్ -----భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణలో .ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే తన జీవిత ఆశయంగా , వారికి అన్ని విధాలుగా ఉపాధి అవకాశాలు కల్పించాలని స్కీల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం చేసి కొన్ని లక్షల మంది పేద విద్యార్థులకు, వివిధ రంగాలలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించి వారి ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక పరిపుష్టి ,మరియు అభివృద్ధికి కృషి చేసిన మా ఆరాధ్య దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ భీమిలి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 27 వ రోజు రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని నియోజకవర్గ 5,6,7,8,98,15,45,89 వార్డుల నాయకురాలతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారితోపాటు రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు మొల్లి లక్ష్మణరావు విశాఖ పార్లమెంటు ఉపాధ్యక్షులు వి. అప్పలరాజు విశాఖ పార్లమెంట్ అధికార ప్రతినిధి దాసరి శ్రీనివాసరావు, సెక్రటరీ సోడి పిల్లి నారాయణరావు, నాగోతి సూర్య ప్రకాష్,బోడపూడి దొరబాబు గారు 5, 8 వార్డుల పార్టీ అధ్యక్షులు నాగోతి సత్యనారాయణ (జపాన్), చెట్టుపల్లి గోపి,

 విశాఖ పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు గరే గురునాథ్, గన్రెడ్డి రమేష్, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు నమ్మి శ్రీనివాసరావు,7వ వార్డు జనరల్ సెక్రెటరీ కానూరి అచ్యుతరావు, ఆరో వార్డ్ బీసీ సెల్ అధ్యక్షులు రెడ్డి సత్యనారాయణ, ఏడో వార్డు తెలుగు యువత అధ్యక్షులు నాగోల్ బుజ్జి, నియోజకవర్గ ఎస్సీ సెల్ జనరల్ సెక్రెటరీ జెపి రాజు, పరమేష్, దేవగుప్త రమేష్ మూడో వార్డు ఉపాధ్యక్షులు మారోజు సంజీవ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కొక్కిరి అప్పన్న, తెలుగు యువత అధ్యక్షులు కనకల అప్పలనాయుడు, సెక్రెటరీ కంచర్ల కామేష్ గారు పోలిరాజు, తదితర నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొని సంఘీభావం తెలియజేశారు.