జీ ఓ 21 రద్దు చేయాలి.సి ఐ టీ యు ఆధ్వర్యాన ధర్నా ..
మధురవాడ--- ప్రజాబలం న్యూస్ --
రాష్ట్రం లో ఆటో రిక్షా కార్మికులు తో పాటు, అన్ని రకాల రవాణా కార్మికులు, చిన్నస్థాయి యజమానులు, జీవో నెంబర్ 21 వలన తీవ్రంగా నష్టపోతున్నారని, ఇటువంటి జీవోను రద్దు చేయాలని, విజయవాడలో రాష్ట్రవ్యాప్తంగా రవాణా కార్మికులు భారీగా ధర్నా కార్యక్రమం చేస్తున్నట్లు విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం సిఐటియు నగర అధ్యక్షులు పి రాజ్ కుమార్ తెలియజేశారు. దీనికి సంఘీభావంగా మధురవాడ జోనల్ కార్యాలయం అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ నిరసన కార్యక్రమం శుక్రవారం నిర్వహించినట్లు తెలియజేశారు.ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ పోలీస్ ఆర్టిఏ అధికారులు విధిస్తున్న అధిక మొత్తంలో ఈ చలానాలు రద్దు చేయాలని డిమాండ్ చేసారు. ఇప్పటికే ఆటో కార్మికులు చాలీచాలని ఆదాయాలతో కుటుంబాలను పోషించుకోవడం చాలా కష్టంగా మారిందని తెలియజేశారు. ఇటువంటి పరిస్థితుల్లో జీవో నెంబర్ 21 నీ తీసుకొచ్చి అధిక మొత్తంలో జరిమానాల విధిస్తూ తీవ్ర వేదనకు గురి చేస్తున్నారని అన్నారు. ఆటో కార్మికులకు శాశ్వతంగా సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని. 60 సంవత్సరాలు పైబడిన ఆటో కార్మికునికి కనీసం 5000 రూపాయల పింఛను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లపై విధించిన ఈ చలానాలు రద్దు చేయాలని కోరారు. ఆటోలు నిలుపుకొనేందుకు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని
డిమాండ్ చేశారు. ఆటో కార్మికులు బయట ఫైనాన్స్ కంపెనీల వడ్డీభారాలు మోయలేకపోతున్నారని తెలియజేశారు. ఆటోలకు ప్రభుత్వ సబ్సిడీతో కూడుకున్న లోన్లు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మధురవాడ జోన్ ఆటో యూనియన్ అధ్యక్షులు జి చిన్నారావు, పి రమేష్ బాబు తో
పాటు యూనియన్ నాయకులు ఎం రాము, జి నర్సింగరావు, శంకర్రావు, బి రవి, ఎం రాజు తదితరులు పాల్గొన్నారు.
