నగరాల సామాజిక తరగతికి మధురవాడలో సామాజిక భవనం నిర్మించాలి---- వై వి సుబ్బారెడ్డి కి, అవంతికివినతిపత్రం అందజేసిన మధురవాడ నగరాల నేతలు.

 - విశాఖ సిటీ--- భీమిలి నియోజకవర్గం --- ప్రజాబలం న్యూస్----విశాఖ జిల్లాఎండాడ లా కాలేజ్ పనోరమ హిల్స్ పక్కన ఉన్న విశాఖ జిల్లా వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వై వి సుబ్బారెడ్డి ని భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాస రావు ని నగరాలు సామాజిక తరగతికి చెందిన అఖిలపక్ష పార్టీల సభ్యులతో కలిసి నగరాల సామాజిక తరగతికి తమ సామాజికఅవసరాల కోసం ఒకసామాజిక భవనం మంజూరు చేయమని కోరుతూ రాష్ట్ర నగరాలు కార్పొరేషన్ చైర్పర్సన్ పిల్లా సుజాత సత్యనారాయణ, విశాఖ జిల్లా నగరాల సంఘం అధ్యక్షుడు పోతిన వెంకటరావు ( సుమన్ వెంకట్రావు) జిల్లా నగరాలు సంఘం కార్యదర్శి జగుపిల్లి అప్పలరాజు, కార్పొరేషన్ డైరెక్టర్లు కొరికాని మోహన్ రావు, వాండ్రాసి శ్యామల, కురిటి లోహిత్, వివిధ పార్టీలకు చెందిన నగరాల వర్గం నాయకులు వినతి పత్రాన్ని ఇచ్చారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ సామాజిక తరగతనే బీసీ లో చేర్చారని తెలిపారు. వైయస్సార్ అంటే తమకు ఎనలేని అభిమానం అని, ఆయన తనయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమకు ఒక సామాజిక భవనాన్ని మంజూరు చేసే విధంగా వైవి, అవంతి కృషి చేయాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా వెనుకబడిపోయిన మా సామాజిక తరగతికి ఒక భవనం అవసరమని దానికి అవసరమైన స్థలాన్ని కేటాయించి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అందుకు వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆ పని జరిగేటట్లు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.