విద్యా వైద్యానికి పెద్ద పీట -- ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి-- భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్

 ఆరోగ్య సంజీవని--- జగనన్న ఆరోగ్య సురక్ష ---- మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు



భీమిలి నియోజకవర్గం--- ప్రజాబలం న్యూస్ - - (పద్మనాభం మండలం ) రేవిడి పంచాయతీ లో


ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం గా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా యంపిపి కంటుభోతు రాంబాబు - వైస్ యంపిపి కోరాడ లక్ష్మణ రావు, ఆధ్వర్యంలో పాండ్రంగి పంచాయతీ లో ఘనంగా నిర్వహించారు.


 ఈ సందర్భంగా అవంతికి అడగడుగునా మహిళలు స్వాగతం పలికారు  


  20 లక్షలు రూ నిధులు తో మౌళిక వసతులతో నూతనంగా నిర్మించిన వెల్ నెస్ సెంటర్ ను అవంతి చేతులు మీదుగా ప్రారంభోత్సవం చేశారు.


జగనన్న ఆరోగ్య సురక్ష శిభిరం లో వైద్య సేవలు అందిస్తున్న వైద్యులను అవంతి చేతులు మీదుగా ఘనంగా సన్మానం చేశారు. అవంతి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరికీ కావాల్సింది కూడు గూడు వైద్యం విద్య రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడు అనేది సంక్షేమ పథకాలు అమలు ద్వారా ,గూడు అనేది జగనన్న కోలనీ ద్వారా,విద్య అనేది నాడు నేడు ద్వారా పాలన అందిస్తే పేదవాడి కి అందని కార్పోరేట్ వైద్యం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ద్వారా పల్లె పల్లె కు అందిస్తే నేడు జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా అందించడం చేస్తున్నారని దీని ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో వైద్యం అందని వారు ఉండకూడదు అని, ఆరోగ్యం ఉంటేనే మనం ఆనందంగా ఉండగలమని అలాంటి ఆరోగ్యవంతమైన జీవితం అందిచడం ప్రభుత్వం ఆశయం అని బాదత్య తో ప్రతీ ఒక్కరు పని చేసి విజయ వంతం చేయాలని అన్నారు.



అనంతరం అంగన్వాడీ కేంద్రం వారు ఏర్పాటు చేసిన పలు రకాల స్టాల్స్ ను ఆయన పరిశీలించారు.


రేవిడి యానాద్రి చెరువులో చేపలు పెంపకం కోసం అవంతి చేతులు మీదుగా చెరువులో చేపలు వేశారు.


ఈ కార్యక్రమంలో మండల అధికారులు - పద్మనాభం మండలం వైసిపి పార్టీ శ్రేణులు - వైద్యులు - వైద్య బృందం - ఆశా వర్కర్లు - అంగన్వాడీ టీచర్లు - సచివాలయం కన్వినర్ లు గృహ సారథులు - కార్యకర్తలు - ప్రజలు పాల్గొన్నారు.