కాంతితో క్రాంతి-- పాత మధురవాడలో భారీ నిరసన.-- కార్పొరేటర్ మంగమ్మ

 మధురవాడ-- ప్రజాబలం న్యూస్-- తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు కాంతితో క్రాంతి అనే నిరసన కార్యక్రమం 7వ వార్డు పిలకవనిపలెం, పాత మదురవాడ (మెట్ట) లో నిర్వహించారు.


 ఈ కార్యక్రమంలో 7వ వార్డు కార్పొరేటర్ పిళ్ళా మంగమ్మ రాష్ర్ట వాణిజ్య విభాగ నిర్వాహక కార్యదర్శి పిళ్ళా వెంకటరావు, సెక్రెటరీ అత్చుత రావు టీడీపీ సీనియర్ నాయకులు పోతిన నాయుడు, టేకు పూడి నర్సింగరావు, మొక్కల సన్యాసిరావు,, టీడీపీ కార్యకర్తలు మహిళలు తెలుగుదేశం యువనాయకులు పాల్గొన్నారు.