విశాఖలో ప్రభుత్వ భూముల రికార్డులు ట్యాంపరింగ్ చేసి ప్రభుత్వ భూములను కాజేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. రెవిన్యూ రికార్డు ట్యాంపరింగ్ అభియోగాలు నమోదైన అధికారులను విచారించాలి. నలుగురు డిప్యూటీ కలెక్టర్లతో సహా ఏడుగురు అధికారులకు జాయింట్ కలెక్టర్ నోటీసులు. ఈనెల 22న విచారణ. ఇప్పటికైనా నిజాయితీతో చిత్తశుద్ధితో విచారణ చేయాలి . సిపిఐ డిమాండ్.

విశాఖపట్నం (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) విశాఖ రూరల్ మండలంలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు కాపాడి ప్రభుత్వ ప్రజా అవసరాలకు వినియోగించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు డిమాండ్ చేశారు. రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్ అభియోగాలు నమోదైన అధికారులను విచారించాలని నలుగురు డిప్యూటీ కలెక్టర్లుతో సహా..ఏడుగురు అధికారులకు జాయింట్ కలెక్టర్ నోటీసులు ఇచ్చి ఈనెల 22న విచారణకు హాజరుకావాలని ఆదేశించారని
కొమ్మాది, ఎండాడలో రెవెన్యూ రికార్డుల ట్యాంపిరింగ్ వ్యవహారం పై ఆదివారం పైడిరాజు ఒక ప్రకటన విడుదల చేశారు. సిపిఐ గత 10 సంవత్సరాలనుండి జిల్లా ఉన్నత అధికారులుకు వినతిపత్రాలు ఇచ్చినా ఏమాత్రం పట్టించుకోలేదని ఇప్పటికైనా సక్రమంగా విచారించి అందుకు బాద్యులైన భూ కబ్జాదారులను, వారికి అన్నివిధాలుగా సహకరించిన రెవిన్యూ అధికారులను, చట్ట పరంగా తగు చర్యలు తీసుకొని విలువైన భూములు కాపాడాలని తన ప్రకటనలో కోరారు. గత 10 సంవత్సరాల క్రిందటే సిపిఐ వెలుగులోకి తీసుకొచ్చిన అన్యాక్రాంతమైన భూములు వివరాలు కొన్ని 1. మధురవాడ సర్వే నెం: 190 లో మాజీ శాసనసభ్యుడు తిప్పల గురుమూర్తి రెడ్డి కొనుగోలు చేసిన భూమిలో ప్రభుత్వ భూమిని కలుపుకొని కాంపౌండ్ వాల్ నిర్మించడమే కాకుండా ప్రభుత్వ భూమిలో 30 అడుగుల వెడల్పు గల రహాదారి ని నిర్మాణము చేసుకున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలి. 2. మధురవాడ సర్వే నెం : 61లో 4 ఎకరముల 30 సెంట్ల ప్రభుత్వ భూమిలో 3 ఎకరముల కబ్జాదారులు కబంద హస్తాలలో చిక్కుకుంది. దీనిపై విచారణ చేసి ప్రభుత్వ భూమిని స్వాదీనం చేసుకోవాలి. 3. మధురవాడ సర్వే నెం : 294 లో 2 ఎకరముల 70 సెంట్లు ప్రభుత్వ భూమి కబ్జాకు గరైయింది. దీనిపై విచారణ చేసి ప్రభుత్వం స్వాదీనం చేసుకోవాలి. 4. మధురవాడలో 22 ఖాతాలలో 1బి రికార్డులు తారుమారు చేశారు. ఇందులో 55 ఎకరముల ప్రభుత్వ భూమి 5.5 ఎకరాల ప్రైవేట్ భూమి అన్యాక్రాంతమయినది. దీని విలువ సుమారు 560 కోట్ల రూపాయిలు. దీనిపై విచారణ చేసి ప్రభుత్వం స్వాదీనం చేసుకోవాలి. 5. విశాఖ రూరల్ మండలం లో గడిచిన 10 సంవత్సరాలనుండి 90 చోట్ల కబ్జాకు గురైన భూమలలో ప్రభుత్వ భూమి అని బోర్డులు పెట్టిన కబ్జాదారులు బోర్డులు తీసివేసి నిర్మాణాలు కొనసాగిస్తున్నా ఏవిధమైన చర్యలు లేవు. దీనిపై . విచారణ చేసి ప్రభుత్వం స్వాదీనం చేసుకోవాలి. 6. కొమ్మాది సర్వే నెం: 37లో 11 ఎకరములు ప్రభుత్వానికి చెందిన అటవీ భూమిని ఎమ్. ఆర్.కె. రాజు అనే భూకబ్జాదారుడు కబ్జా చేసాడని సి.పి.ఐ. గత పది సంవత్సరముల నుండి పోరాటం చేస్తున్నాం. ఈ మద్య కాలంలో విశాఖపట్నం అర్టన్ డెవలప్మెంట్ ఆధారిటీ వారు ఈ భూమిలో వారి బోర్డులు పెట్టుట జరిగినది. ఈ భూమిని పరిరక్షించాలని కోరుతున్నాము. 7. కొమ్మాది సర్వే నెం : 159/3 లో 2 ఎకరముల 76 సెంట్ల భూమి కబ్జాకు గురైయినది. దీనిపై సి.బి.ఐ. విచారణ చేసి ప్రభుత్వం స్వాదీనం చేసుకోవాలి. 8. కొమ్మాది సర్వే నెం : 154/3 లో 5 ఎకరముల ప్రభుత్వ భూమిలో లే అవుట్ వేసి కబ్జాదారులు ప్లాట్ లు గా విభజిస్తున్నారు. దీనిపై విచారణ చేసి ప్రభుత్వం స్వాదీనం చేసుకోవాలి. 9. కొమ్మాది సర్వే నెం : 7లో 50 ఎకరముల ప్రభుత్వ భూమిని 10 సంత్సరముల క్రితం మైటాస్ సంస్థకు కేటాయించిన ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. వెంటనే ఆ భూమిని ప్రభుత్వం స్వాదీనం చేసుకోవాలి. 10. కొమ్మాది కొమ్మాది 31 ఖాతాలలో 1 బి రికార్డులు 176 ఎకరముల ప్రభుత్వ భూమి 1.47 ఎకరముల ప్రైవేటు భూములను టాంపరింగ్ చేశారు. దీని యెక్క విలువ 1,650 కోట్లు రూపాయిలు. దీనిపై విచారణ చేసి ప్రభుత్వం స్వాదీనం చేసుకోవాలి. 11. కొమ్మాది సర్వే నెం : 28/2 లో 10 ఎకరముల 18 సెంట్లు ప్రభుత్వ భూమిని మాజీ రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అను యాయులు కబ్జాకు గురించేశారు. దీనిపై విచారణ చేసి ప్రభుత్వం స్వాదీనం చేసుకోవాలి. 12. పరదేశిపాలెం సర్వే నెం : 90/2లో (మారికవలస గ్రామం ) 3 ఎకరముల 70 సెంట్లు కబ్జాకు గురైతే ఇది ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టినా, బోర్డులు తీసివేసి కబ్జాలకు పాల్పడుతున్నారు. దీనిపై విచారణ చేసి ప్రభుత్వం స్వాదీనం చేసుకోవాలి. 13.పరదేశిపాలెం సర్వే నెం : 66లో అన్యాక్రాంతమైన 35 ఎకరములు భూదాన భూములను 10 సంవత్సరముల నుండి సి.పి.ఐ. పోరాటం చేస్తున్న నేటికి చర్యలు లేవు. దీనిపై విచారణ చేసి ప్రభుత్వం స్వాదీనం చేసుకోవాలి. 14. పరదేశిపాలెం సర్వే నెం : 20/4లో 2 ఎకరముల 82 సెంట్లు ప్రభుత్వ భూమి రికార్డులలో 22 ఎ గయాలు గా ఉన్నప్పటికి 1బి రికార్డులో ఇది తిరుమలరాణి అని నమోదు చేశారు. దీనిపై విచారణ చేసి ప్రభుత్వం స్వాదీనం చేసుకోవాలి. 15. పరదేశిపాలెం సర్వే నెం 187/1 లో 4 ఎకరాల 89 సెంట్లు విలువైన ప్రభుత్వం భూమిని రికార్డులు తారుమారు చేసి మాజీ రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తన కుమారుడు రాం మనోహర్ నాయుడు పేరున కొట్టేసిన భూమిని స్వాధీనం చేసుకోవాలి