ఆంధ్ర యూనివర్సిటీ వైస్ చాన్సులర్ గా ఖరగ్పూర్ ఐఐటి కి చెందిన గణిత శాస్త్ర ప్రొఫెసర్ పి జి రాజశేఖర్ నియామకం

విశాఖపట్నం, ,మధురవాడ (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను ) విశాఖపట్నం,ఆంధ్ర యూనివర్సిటీ వైస్ చాన్సులర్ గా పీజీ రాజశేఖర్ ను నియామకం చేస్తూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గెజిట్ నోటిఫికేషన్ మంగళవారంవిడుదల చేశారు. ఖరగ్పూర్ ఐఐటీ కి చెందిన గణితశాస్త్రం ప్రొఫెసర్గా రాజశేఖర్ పని చేస్తున్నారు. ఇతనని ఏ యు వైస్ ఛాన్స్లర్గా నియమించడం పట్ల ఏయూ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.