స్వర్ణ ఆంధ్ర --స్వచ్ఛ ఆంధ్ర.

స్వర్ణ ఆంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర-- మధురవాడ జోన్ టు కమిషనర్ కనకమహాలక్ష్మి విశాఖపట్నం సిటీ.మధురవాడ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ 9502817542) మధురవాడ జీవీఎంసీ 5 వ వార్డ్ పరిది వైఎస్ఆర్ కాలనీ లో శనివారం జోనల్ కమిషనర్ కనకమాహాలక్ష్మి ఆధ్వర్యంలో 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం కార్పొరేటర్ హేమలత, జోనల్ కమిషనర్ కనకమాహాలక్ష్మి, ఏ ఎమ్ హెచ్ ఓ కిషోర్ తదితరులు మాట్లాడుతూ వేసవి ఎండ వేడిమితో చాలా జాగ్రత్తగా ఉండాలని, ప్రజలందరూ ఉదయం 9 లోపు మరియు సాయంత్రం నాలుగు తర్వాత బయట తమ పనులను అన్ని పూర్తి చేసుకోవాలని అలాగే అత్యవసర సమయాల్లో బయటికి వెళ్లినప్పుడు ఎండ వేడిమి తట్టుకునేలా టోపీ ధరించాలని లేదా గొడుగు పట్టుకొని వెళ్లాలని,వడదెబ్బ తగలకుండా నీరు,జ్యూస్, ఓఆర్ఎస్ లాంటి చలువ పానీయాలు క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలును శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలని, ప్లాస్టిక్ సంచులు వాడడం మాని గుడ్డ సంచులే వాడాలని కాలనీ మహిళలు, అధికారులతో కలిసి కాలనీలో అవగాహన ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు కాలనీ నాయకులు ఓలేటి శ్రావణ్, నూకరాజు, మొకర రవికుమార్, కోసూరు మాధవ, వాసు, సచివాలయ కార్యదర్శులు డ్వాక్రా సంఘం ఆర్పీలు కాలనీ మహిళలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.