35 కోట్ల ప్రభుత్వభూమి కబ్జా. వైసిపి కబ్జా తెలుగుదేశం సపోర్ట్ . ఇవేవీ పట్టని ఎమ్మెల్యే. అధికారం వారి చేతిలో ఉంటే కార్పొరేటర్ల పై పెట్టే ప్రయత్నం. బాధ్యత కార్పొరేటర్ల దే ఆట. స్థానిక ఎమ్మెల్యేకు సంబంధం లేదా? ఎమ్మెల్యే పి ఏ హవా.. విశాఖపట్నంలో జరుగుతున్న భూకబ్జాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించాలి. పట్టించుకోని విశాఖ జిల్లా కలెక్టర్ ...

కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమి కబ్జా మీడియా గోషిస్తున్న పట్టించుకోని ఎమ్మెల్యే. . సత్యకు కబ్జాలో వాటా--- కోడై కూస్తున్న స్థానికులు. వాటా లేకపోతే ఎందుకంత మౌనం. చోద్యం చూస్తున్న రెవెన్యూ టౌన్ ప్లానింగ్ అధికారులు... ప్రభుత్వ భూములను రాం బందుల్లా తన్నుకు పోతున్న టిడిపి వైసిపి తమ్ముళ్ళు.
జివిఎంసి ఆరువ వార్డు పరిధి రేవెల్లపాలెం గ్రామం మధురవాడ సర్వేనెంబర్ 214లో ప్రభుత్వ భూమిని రాంబందుళ్ళ మింగేస్తున్న రెవెన్యూ టౌన్ ప్లానింగ్ అధికారులు చోద్యం చూస్తున్నారు. ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేసి భారీ రేకుల షెడ్లు నిర్మాణం చేసి ఏకంగా లేఅవుట్ వేశారు. ఎప్పుడో ఎక్కడో చచ్చిపోయిన పట్టాలు పట్టుకొని తమ అధికార ప్రతిపక్ష బలంతో నిర్మాణాలు జోరుగా చేస్తున్నారు.. టిడిపి వైసిపి రెండు కుమ్మక్కు అయ్యి ఈ నిర్మాణాలు చేశారన్న ఆరోపణలు బలంగానే వినిపిస్తున్నాయి. బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ నిర్మాణాలకు 2015లో ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి.. గత వైసిపి ప్రభుత్వం లో నిర్మాణాలు చేసేందుకు ప్రయత్నించిన అప్పటి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు రెవెన్యూ అధికారులకు గట్టిగా ఎటాక్ ఇవ్వడంతో అక్కడ ఎటువంటి నిర్మాణాలు జరగలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెళ్లి వెతుకుతున్నాయి.. ఈ రేకుల షెడ్లలో ఎమ్మెల్యే పిఏకు వాటా ఉందని అందువల్లే ఆ షెడ్లు జోలికి వెళ్లలేదని బహిరంగంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం ఎమ్మెల్యేకి తెలిసినప్పటికీ మౌనం వహించడం పట్ల అది అర్ధాంగికారంగా ఉన్నారని తెలుస్తోంది.. భీమిలి నియోజకవర్గంలో భూ కబ్జాలో జరిగితే అవి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చి అవి కబ్జా జరగకుండా చూడవలసిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే పై ఉంది. ఆయన తప్పించుకొని తిరగడం పట్ల హలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మధురవాడలో గజ్జం స్థలం ఏం మూలను చూసుకున్నా 50,000 పలుకుతుంది అటువంటిది మధురవాడ బ్రిడ్జికి కూత వేటు దూరంలో మాస్టర్ ప్లాన్ రోడ్డు ఆనుకొని పోట్లాది రూపాయలు విలువ చేసే ఈ భూమిని కబ్జా చేసిన పట్టించుకోలేదంటే రెవెన్యూ అధికారులు హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఇందులో సత్య హస్తం ఉందని ఆ సత్యవంతుడే దగ్గరుండి నడిపిస్తున్నాడు అన్న ఆరోపణలు సర్వత్ర వెళ్ళువెత్తుతున్నాయి. పేదోడు చిన్న పాక వేసుకుంటే ఆగ మేఘాలపై వాలిపోయే రెవిన్యూ టౌన్ ప్లానింగ్ అధికారులు పక్కాగా కబ్జా చేసి రేకుల షెడ్లు నిర్మాణాలు చేస్తే వాటిపై కన్నెత్తి చూడకపోవడం పట్ల వీరిపై మరిన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి. రేవెల్లపాలెం గ్రామంలో ఆ భూమిని పంచుకొని ఊరంతా ఏకమై ఎప్పుడో ఐదు లక్షల రూపాయలు గుడి నిర్మాణానికి ఇచ్చారన్న ఆరోపణ నేపథ్యంలో ఈ పంచాయతీ గంటా వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. అందువల్లే గ్రామస్తులు కూడా కిమ్ముమని అనలేదని ఎవరేం చేసుకుంటారో చేసుకోండి అని బహిరంగంగానే వారి వాయిస్ వినిపిస్తోంది. ప్రధాన అధికార ప్రతిపక్ష పార్టీలు చోటా నాయకులు ఒకటై ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మాణాలు చేస్తున్నారు. ఆ నిర్మాణాలు క్రమబద్ధీకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. విద్యుత్ మీటర్లు ఇంటి పనులు వేసేందుకు చక్క చక్క ఏర్పాటు జరుగుతున్నాయని అవి జరగకుండ ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ నిర్మాణాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. .