ఇంటింటా జగద్గురు ఆది శంకరా చార్యుల విగ్రహం పంపిణీ:

ఇంటింటా జగద్గురు అది శంకరాచార్య విగ్రహ పంపిణి ప్రారంభం. విశాఖపట్నం (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) నగరానికి చెందిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ విశాఖ ట్రావెల్ అండ్ టూరిజం ఫౌండేషన్ అద్వర్యం లో సప్తఋషి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణలో ఉచిత శ్రీ శ్రీ శ్రీ అది శంకరాచార్యుల విగ్రహ పంపిణి ప్రారంభం అంగరంగ వైభవంగా శుక్రవారం ఎంవీపీ కాలనీ లో ఉన్న టీవీ టూరిజం కార్యాలయం లో ప్రముఖ దర్శకుడు , జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ మణి భూషణ్ చేతులమీదుగా ముఖ్య అతిధి ప్రముఖ నటుడు దర్శకుడు శ్రీ ప్రసన్న కుమార్ వేద గురువు శ్రీ ఎం మాధవశర్మ బ్రహ్మ కుమారి రామేశ్వరి ఇతర ప్రముఖులు సమక్షం లో విగ్రహాల పంపిణి ప్రారంభించారు. ఈ సందర్బంగా డాక్టర్ మణి భూషణ్ మాట్లాడుతూ మానవత్వం అంటే ప్రేమ , మన చుట్టూ వున్నా ప్రకృతిని ప్రేమించాలి అలాగే సనాతన ధర్మాన్ని ప్రేమించాలి అదే నినాదం తో వేద ప్రచారం , సనాతన ధర్మ సంస్థాపన కోసం అఖండ భారతావని యాత్ర చేసి, జాతిని జాగృతం చేసిన మహనీయుడు జగద్గురువు అది శంకరాచార్యులు అలంటి మహనీయ వ్యక్తి యొక్క విగ్రహాలు ప్రతి ఇంటిలో ఉండాలి అనే సంకల్పం చేసిన సప్తఋషి వేదపాఠశాల గురువులు శ్రీ మాధవశర్మ మహానుభావుడని , వారి అజరామర సేవలు అఖండ భారతావని ఎప్పటికి గుర్తుపెట్టుకునేలా , చరిత్రలో నిలిచిపోయేలా ఉన్నాయని తెలిపారు. మరో అతిధి శ్రీ మాధవశర్మ మాట్లాడుతూ భారతీయ ఉపఖండంలో పర్యటించి తన తత్వాన్ని ఇతర ఆలోచనాపరులతో ఉపన్యాసాలు, చర్చల ద్వారా ప్రచారం చేశాడు. మీమాంస హిందూ మత సంప్రాదాయం కఠినమైన కర్మకాండను స్థాపించి, సన్యాసాన్ని ఎగతాళి చేసిన సమయంలో, ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాల ప్రకారం సన్యాసి జీవితం ప్రాముఖ్యతను ఆయన స్థాపించాడు. అతడు నాలుగు మఠాలను స్థాపించినట్లు పేరుపొందాడు, మరో అతిధి బ్రహ్మకుమారి రామేశ్వరి మాట్లాడుతూ ఇది అద్వైత వేదాంతం యొక్క చారిత్రక అభివృద్ధి, పునరుజ్జీవనం వ్యాప్తికి సహాయపడింది. అందువలన హిందూమతం గొప్ప పునరుజ్జీవన కర్తగా పేరొందాడు అని చెప్పారు. ముఖ్యఅతిథి సినీ నటుడు శ్రీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే - స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః - అంటే దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించాడు అని తెలిపారు , ఇలాంటి సనాతన ధర్మాన్ని కాపాడే సంస్థలు ఎంతో స్ఫూర్తిని కలిగిస్తున్నాయని , ప్రతి ఒక్కరు మన సంస్కృతి , సంప్రదాయాలను , ధర్మాన్ని కాపాడే దిశగా ప్రయాణించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో సీఈఓ సీత రామ స్వామి , ఎడిటర్ నీరజ , హీరో ఆదిత్యభూషణ్ , సత్యవాణి , వెంకటలక్ష్మి , వి ఆర్ రావు, చైతన్య , వెంకటరమణ , శ్రీనివాస్, అల్లాడ లింగేశ్వరరావు, అధికసంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ విగ్రహాల కోసం ఎవరైనా దాతలు గాని లేదా గ్రహీతలు గాని 9848418582 నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు. ఇట్లు విశాఖ ట్రావెల్ అండ్ టూరిజం ఫౌండేషన్, విశాఖపట్నం. 9848418582