శిల్పారామం జాతర గట్టుపై వెలసియున్న దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు.

చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో విశేష పూజలు. విశాఖపట్నం,మధురవాడ, ప్రజా బలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను ) చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారికి మాఘ మాసం కృష్ణ పక్షం విదియ శుక్రవారం సందర్భంగా నిత్య అర్చనలతో పూజా కార్యక్రమాలు ప్రారంబించి ప్రత్యేక కుంకుమార్చనలు, పుష్పార్చనలు తదితర పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు పట్నాల హరి ప్రసాద్ శర్మ, మూర్తి శర్మ తదితరులు జరిపించి నీరాజన మంత్రపుష్పం అమ్మవారికి సమర్పించి భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు, శుక్రవారం అమ్మవారి రోజు కావడంతో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమార్చనలు జరిపి అమ్మవారిని దర్శించుకొని పసుపు కుంకుమలు సమర్పించి ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించారు, ఈ సందర్భంగా మిధిలాపురి ఉడాకోలని వాస్తవ్యులు శ్రీనివాసన్ , ఈషో కుటుంబ సభ్యుల సహకారముతో ఏర్పాటు చేసిన మిరియాలు పొంగల్ ప్రసాదమును అమ్మవారికి సమర్పించి అనంతరం భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు పంపిణీ చేశారు, సాయంత్రం వేళ శ్రీదుర్గాలమ్మ అమ్మవారికి పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, జలాభిషేకం చేసి ప్రత్యేకంగా అలకరణ చేసి కుంకుమార్చనలు పుష్పార్చనలు చేసి నీరాజనం మంత్రపుష్పం సమర్పించి అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు, ఈ కార్యక్రమంలో శ్రీదుర్గాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు, ఉపాధ్యక్షులు పి.వి‌.జి.అప్పారావు, సెక్రటరీ నాగోతి తాతారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పిళ్లా మోహన్ శివకృష్ణ, కమిటీ సభ్యులు పిళ్లా వెంకటరమణ, పోతిన పైడిరాజు, పిళ్లా రాజు, పిళ్లా సన్యాసిరావు, కేసనకుర్తి అప్పారావు, ముఖ్య సభ్యులు పిళ్లా పోతరాజు, పిళ్లా అప్పన్న,పిళ్లా సూరి పాత్రుడు, యస్. శ్రీను, డి.అప్పారావు, పి.రాంబాబు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.