విశాఖ రైల్వే జోన్ గా కేంద్రం ఉత్తర్వులు జారీ. జోన్ హద్దులను ప్రకటించిన కేంద్రం .
February 05, 2025
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్
విశాఖపట్నం
(ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ :సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను )
ఉత్తర్వులు జారీచేస్తూ కేంద్రం కీలక నిర్ణయం
విశాఖ రైల్వే డివిజన్ ను ఏర్పాటు చేస్తూ కేంద్రం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నో సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల ఆకాంక్షగా ఉన్న సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిని నిర్ణయించడంతో పాటు విశాఖ కేంద్రంగా డివిజన్ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. . విశాఖ కేంద్రంగా ఏర్పాటైన సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిని 410కి.మీ గా రైల్వే శాఖ నిర్ణయించింది. వాల్తేరులో ఉన్న ఆంధ్రప్రదేశ్ రైల్వే సెక్షన్లను విశాఖకు బదిలీ చేసింది. కొండపల్లి-మోటుమర్రి సెక్షనను విజయవాడ డివిజను, విష్ణుపురం- పగిడిపల్లి, విష్ణుపురం - జాన్పాడ్ రూట్లను సికింద్రాబాద్ కు మార్చింది. విశాఖ డివిజన్ పరిధిని కూడా మార్చింది. విశాఖ డివిజన్ పరిధిలో ఏయే మార్గాలను చేరుస్తున్నారనే విషయాన్ని కూడా కేంద్రం వెల్లడిరచింది. ఈ జోన్ పరిధిలోకి విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు వస్తాయి.