అనాధలకు అన్నదానం--- వాసవి క్లబ్ ఎం వి పి కపుల్స్ అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో--- విస్తృతంగా సేవా కార్యక్రమాలు.
February 06, 2025
విశాఖపట్నం (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)
వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో గురువారం భీంనగర్ ...ఏయుటిడి లో ఉన్న 70 మంది నిరాశ్రయులయిన, అనాధ వయోవృద్ధులకు కీర్తిశేషులు శ్రీమతి గ్రంధి సీతారత్నం జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ గ్రంధి వాసుదేవ మూర్తి, కోడలు శ్రీమతి లక్ష్మీ వారి కుటుంబ సభ్యులు సహకారంతో అన్నదానం ఏర్పాటు చేయడమైనది. ఈ అన్నదానము ఏర్పాటుపై ఏ యు టి డి, భీమ్ నగర్ సిబ్బంది అన్నదాతలకు, వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిధిగా వాసవి క్లబ్ జిల్లా ఆఫీసర్ శ్రీ సిహెచ్. వి .బంగారు రాజు అబ్జర్వర్ గా హాజరైనారు. వాసవి క్లబ్ అధ్యక్షులు Vn.ఏవి రామకృష్ణారావు, కోశాధికారి Vn పిసిహెచ్ గుప్తా, (వాసవియన్లు) చెరుకు కృష్ణ ,
గ్రంధి వాసుదేవ మూర్తి కాపుగంటి శ్రీనివాసరావు పాలూరు శివరామకృష్ణ గోగుల నర్సింగరావు గ్రంధి కృష్ణారావు మొదలైన వారు హాజరైనారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.