పేద బాలికకు అండగా అమ్మ సేవా సంస్థ.
May 20, 2025
పేద బాలికకు అండగా నిలిచిన అమ్మ సేవా సంస్థ.
జామి మండలం కుమరాం గ్రామ కాపురస్తులు శంకర్(రైస్ మిల్లీ డ్రైవర్) యొక్క 4గేండ్ల అమ్మాయికి నాలుక పైకి వచ్చి గాలి పీల్చుకోవడానికి,ఆహారం తీసుకోవడానికి ఇబ్బంది పడుచున్నదని, *హాస్పిటల్ కు తీసుకెళ్తే వారి వద్ద ఉన్న రూపాయలతో,గ్రామంలో యువత,ఉద్యోగుల,పెద్దల సహాయంతో ఆపరేషన్ చేయిస్తే*
నయం కాకపోతే రాయవెళ్లూరు తీసుకెళ్లగా
ఆపరేషన్ కు 5 లక్షలు అవుతుందని చెప్పారని *నాయొక్క శిష్యులు పినింటి నవీన్,గెడ్డపు ఈశ్వరరావు లు వారిని తీసుకువచ్చి పెన్షన్ గాని,ఆర్థిక సహాయం కనిచేయిస్తే ఆదుకొనేవారగుతారని చెప్పగా*
అనేక ప్రయత్నాలు చేసి తదనంతరం వివిధ సేవా కార్యక్రమాలలో మరియు కరోనాలో కూడా *"మా భార్గవ్ హెల్ప్ లైన్" కార్యక్రమాలతో కలిసి పనిచేసిన "అమ్మా సేవా సొసైటీ" సభ్యులు* నా మిత్రులు మరియు మా DPRTU సంఘ సభ్యులు *అల్లం పురుషోత్తం గారితో*
మాట్లాడి అమ్మా సొసైటీ వారితో కలిసి మాట్లాడితే
*3 నెలల క్రితం 30 వేలు ఆర్థిక సహాయం చేసారు.మరల పరిస్థితి గమనించి నేడు (20.5.2025) 1,50,000/- (ఒక లక్షా ఏభై వేలు) గతంతో కలిపి 1,80,000 ఇవ్వడం*
ఆ సంస్థ యొక్క ఉదారత,ఆ సభ్యుల యొక్క పరిమళించిన మానవతాహృదయాలకు నమస్కారాలు తెలియజేస్తూ, *అందులో నేను కూడా భాగస్వామిని అయినందులకు* కొద్దిమందికైనా స్ఫూర్తినిచ్ఛే అవకాశం వచ్చినందులకు ఆనందపడుచు
*కంది వెంకటరమణ*
వ్యవస్థాపకులు.
*భార్గవ్ హెల్ప్ లైన్*
జిల్లా మేనేజ్మెంట్ కమిటీ మెంబర్,
*ఇండియన్ రెడ్ క్రాస్.*
జిల్లా కన్వీనర్.
*బాలల హక్కుల పరిరక్షణ ఫోరమ్*