భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలో ఓ శుభకార్యములో పాల్గొన్న విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిన్న శ్రీను. భీమిలి నియోజకవర్గం లో వైసీపీ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే కార్యకర్తలతో మమేకం. ఏదో వంకన జోరుగా పర్యటనలు. పూర్వపు బంధాలను పటిష్టం చేస్తున్న చిన్న శ్రీను. తనదైన మార్కు ప్రయత్నాలు.

విశాఖపట్నం జిల్లా,ఆనందపురం మండలం కుసలవాడ గ్రామంలో వారి నివాసంలో జరిగిన వెన్ని గౌరీ కుమార్తె పుష్పవతి శుభకార్యం లో విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీను (చిన్న శ్రీను ) గౌరీ పాల్గొని ఆమెను అక్షింతలు వేసి దీవించారు. ఈ కార్యక్రమంలో.. ఆనందపురం జడ్పిటిసి కోరాడ వెంకట్రావు ,గండిగుండం సర్పంచ్ శ్రీనివాసు ,వైస్ ఎంపీపీ పాండ్రంగి శ్రీను నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..