రెండు కిలోల గంజాయి పట్టివేత.---- పీఎం పాలెం సిఐ బాలకృష్ణ.. ఎస్సై భాస్కర్ తో ముద్దాయి.
March 09, 2025
రెండు కిలోల గంజాయిని పీ.ఎం. పాలెం పోలీసులు పట్టుకొని ఓ వ్యక్తిని ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు.
విశాఖ నార్త్ సబ్ డివిజన్(, పి. ఎం. పాలెం. ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను)
పీఎం పాలెం సిఐ బాలకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పీఎం పాలెం పోలీసులకు వచ్చిన గంజాయి కి సంబదించిన సమాచారం పై , పిఎం పాలెం పోలీసు సిబ్బంది కొమ్మది హౌసింగ్ బోర్డ్ కాలనీ దగ్గర లో ఆదివారం మధురవాడ స్వతంత్ర నగర్ కి చెందిన అంగ రాజేష్, 27 సంవత్సరాలు అను వ్యక్తి ని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి 2 కిలోల గంజాయి ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై సిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముద్దాయి ని రిమాండ్ కి పంపించారు..