సమాజ సేవలో ఎంవిపి వాసవి క్లబ్ కపుల్ అధ్యక్షుడు రామకృష్ణ చేస్తున్న నిజాయితీ సేవలు బేస్... కొనియాడిన వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షుడు ఇరుకుల్ల రామకృష్ణ ... ఆర్వో ప్లాంట్ ప్రారంభోత్సవం చేసిన వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షుడు.. వెంకోజీ పాలెం శిరిడి సాయి ఆలయంలో ఆర్ఓ ప్లాంట్ వితరణ చేసిన ఎం వివి సిటీ కపుల్స్ . అధ్యక్షుడు రామకృష్ణ..

విశాఖపట్నం ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) వాసవీ క్లబ్ ఎం వి పి కపుల్స్ నకు ఆదివారం సాయంత్రం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్విల్ విజిట్ సందర్భంగా ఎం.వి. పి.కాలనీ, సెక్టార్ -1 లో అమ్మా హాస్పిటల్ ఎదురుగా ఉన్న శ్రీ షిరిడీ సాయి బాబా గుడిలో R O PLANT ప్రారంభోత్సవం చేశారు. శ్రీ పాలూరి శివరామకృష్ణ ఆర్థిక సహాయంతో ఆర్ ఓ ప్లాంట్ ను ముఖ్యఅతిథిగా పాల్గొన్న వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల్ల రామకృష్ణ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. తదనంతరం ఇద్దరు నిరుపేద కుటుంబములకు బియ్యం ప్యాకెట్స్, నిత్యవసర సరుకులు అందజేశారు. ఒక చిరు వ్యాపారికి రూ.20,000/- రూపాయలు వడ్డీ లేని రుణ ఆర్థిక సహాయం చేసినారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్లబ్ స్వయం ఉపాధి పథకం కింద చిరు వ్యాపారాలకు ప్రతినెల ఒకరికి రూ.20,000/- వడ్డీ లేని రుణం ఇవ్వడం అభినందనీయమని, అద్భుతమైన సేవగా వర్ణిస్తూ సభ్యులు మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి వాసవి సేవలు వినియోగించుకొని జిల్లాలో ముందు స్థాయిలో ఉండాలని కొనియాడారు . అందుకు తగిన ప్రోత్సాహకాన్ని తాను అందిస్తానని హామీ ఇచ్చారు. గవర్నర్ తమ్మన అమర్నాథ్ గారు మాట్లాడుతూ క్లబ్ అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టే సేవా కార్యక్రమాలు నిజాయితీగా చేస్తున్నారని ఈ సందర్భంగా అంతర్జాతీయ అధ్యక్షుడికి వివరించారు. కొంతమంది రూపాయి సేవ చేసి పది రూపాయలు చెబుతారని అలా కాకుండా రామకృష్ణ చేస్తున్న సేవ నిజాయితీగా జరుగుతుందని పేర్కొన్నారు. సందర్భంగా ఆయనకు వారంతా అభినందించారు. ఎంవిపి వాసవి క్లబ్ కపుల్స్ చేసిన సేవా కార్యక్రమాలు అంతర్జాతీయ అధ్యక్షులు వారికి స్పష్టంగా వివరించారు. . అనంతరం అంతర్జాతీయ అధ్యక్షులు వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి ఇరువురు తో ప్రత్యేకంగా దండలు మార్పించి ముందుగా శిరిడి సాయి పూజలు చేయించి, నూతన వస్త్రాలు సమర్పించి సన్మానం చేశారు. అభినందనలు తెలిపారు. భార్యాభర్తలు ఇద్దరూ దండలు మార్చుకొని శిరిడి సాయి ఆశీర్వాదం, అక్కడ పెద్దలందరు ఆశీర్వాదం పొందారు. స్వామి సన్నిధిలో వివాహ వార్షికోత్సవం జరుపుకోవడం తమకు ఎంతగానో ఆనందంగా ఉందని ఆ దంపతులు పేర్కొన్నారు. శిరిడి సాయి క్యాలెండర్స్, అగర్బత్తీలు క్లబ్ నిర్వాహకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ ప్రధమ మహిళ ఇరుకుల్ల మమత ,వాసవి క్లబ్ అంతర్జాతీయ ఉపాధ్యక్షులు వేద మధుసూదన్ అంతర్జాతీయ కోశాధికారి సుజాత, జిల్లా గవర్నర్ తమ్మన అమర్నాథ్, క్యాబినెట్ కార్యదర్శి సాయినిర్మల, క్యాబినెట్ కోశాధికారి చెరుకు కృష్ణ,వాసవి క్లబ్ ప్రాంతీయ అధికారి ఆదిమూలం తిరుపతి రావు, వాసవి క్లబ్ ప్రాంతీయ అధికారి బండారు రమేష్ , వాసవి క్లబ్ జోన్ చైర్ పర్సన్ కమల్ కుమార్ , క్లబ్ అధ్యక్షులు వెంకట రామకృష్ణారావు, క్లబ్ ప్రధమ మహిళ నాగవేణి,క్లబ్ కార్యదర్శి వెంకటరమణమూర్తి , కోశాధికారి చంద్రశేఖర్ గుప్తా ఫాస్ట్ ప్రెసిడెంట్లు మల్లేశ్వర గుప్తా, గోగుల నర్సింగరావు, రామారావు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి క్లబ్ అధ్యక్షులు ధన్యవాదములు తెలిపినారు.