ఘనంగా భరత్ కుమార్ జయంతి. కార్పొరేటర్ మంగమ్మ సేవలు అమోఘం. -- భీమిలిఎమ్మెల్యేగంటా
March 09, 2025
ఘనంగా ఘనంగా పిల్లా భరత్ కుమార్ జయంతి(నాని).. కార్పొరేటర్ మంగమ్మ, మంగమ్మ సేవలు కొనియాడిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్.
మధురవాడ, (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను ) 7వవార్డ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పిల్లా వెంకటరావు, కార్పొరేటర్ పిళ్ళా మంగమ్మ కుమారుడు దివంగత పిళ్ళా భరత్ కుమార్ (నాని) 31వ జయంతి సందర్భంగా శనివారం పలు సేవా కార్యక్రమాలు చేశారు. పాత విజయం పాఠశాల ఆవరణంలో మెగా రక్తదాన శిబిరం, వైద్య శిబిరం, నిర్వహించారు. . రక్త దాన శిబిరంలో మహిళా దినోత్సవం నాడు మహిళలు సైతం రక్తదానం చేసారు. ఈ రక్త దాన శిబిరం, వైద్య శిబిరంలో గీతం వైద్యాలయంలో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు కార్పొరేటర్ మంగమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ పాల్గొని వాలీబాల్ టోర్నమెంట్ తో పాటు, రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరం,అన్నదానం, తదితర కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం కార్పొరేటర్ మంగమ్మ ఏర్పాటు చేసిన మహిళలకు చీరలు ఆటో కార్మికులకు యూనిఫార్మ్ గంటా శ్రీనివాస్ అందచేశారు. రక్తదాన శిబిరంలో రక్తం దానం చేసిన దాతలకు గుర్తింపు ధ్రువ పత్రాలను ఎమ్మెల్యే గంటా, కార్పొరేటర్ మంగమ్మ చేతుల మీదుగా అందచేశారు. సుమారు వెయ్యి మందికి పైగా అన్నదానం కార్యక్రమంలో అన్నం వడ్డించారు. ఈ కార్యక్రమంలో నార్త్ ఏసీపీ అప్పలరాజు 8వవార్డ్ కార్పొరేటర్ లోడగల అప్పారావు, పిళ్ళా వెంకటరావు టీడీపీ సీనియర్ నేతలు మొల్లి లక్ష్మణరావు, వాండ్రాసి అప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు.