శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన, చట్ట పరంగా తగిన చర్యలు తీసుకుంటాం.. అందుకు తగిన భద్రతా ఏర్పాట్లు చేసాం.. తగిన నిఘా ఏర్పాటు చేశాం. ---పీఎం పాలెం సిఐ బాలకృష్ణ.

భీమిలి నియోజకవర్గం,మధురవాడ, (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను పాత మధురవాడ మెట్ట ) పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యక్రమాలకు శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని అందుకు తగిన భద్రతా ఏర్పాట్లు చేసామని పీఎం పాలెం సిఐ బాలకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. నార్త్ జోన్ ఎసిపి అప్పలరాజు ఆదేశాలతో సిఐ బాలకృష్ణ విశాఖపట్నం సిటీ, నార్త్ సబ్ డివిజన్ పరిదిలో గల పోతిన మల్లయ్య పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో గల IT SEZ ఏరియా లో గల మూడు హిల్స్ పైఅన్ని software కంపెనీలు వాటి చుట్టుపక్కల ఏరియాలో గల అన్ని ప్రాంతాలు పైన పీఎం పాలెం పోలీసులు డ్రోన్ల ద్వారా నిశితంగా నిఘా 24 గంటలు పోలీస్ సిబ్బంది 03 వాహనాలతో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పోలీస్ గస్తీ ని ముమ్మరము చేసారు. ఎవరైనా ఓపెన్ డ్రింకింగ్ చేయడం, గంజాయి త్రాగడం, బైక్ రేసింగ్ లలో పాల్గొనడము, మహిళలతో ఆసబ్యంగా ప్రవర్తించిన ఎడల వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొన బడ తాయని హెచ్చరించారు. అంతకాక IT SEZ ఏరియా పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో గల అన్ని ముఖ్యమైన జంక్షన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆసాంగిక కార్యక్రములకు పాల్పడుతున్న వారిపై నిఘా పెట్టడమైనది తెలిపారు. డ్రోన్ నిఘా కు సంబందిచిన ఫోటోలు జతచేయడమైనది. ఇట్లు ACP, నార్త్ సబ్ డివిజన్ మరియు CI, పి.మ్. పాలెం.