మీరైనా భూకబ్జాలను అరికట్టండి మహాప్రభో --- మన భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటాకు వినతి పత్రం అందజేసిన మధురవాడ సీనియర్ నేతలు గంటాకు వినతి పత్రం అందజేసిన కొమ్మాది మూడుగుళ్ల కమిటీ..

కబ్జాలను అరికట్టండి ఆలయం స్థలాన్ని కాపాడండి! విశాఖపట్నం జిల్లా మధురవాడ మూడు గుళ్లు జంక్షన్ లో ఉన్న శ్రీ బంగారమ్మ శ్రీ ఎర్నమ్మ శ్రీ దుర్గా దండుమారమ్మ ఆలయం వెనుక భాగంలో ఉన్న ఆలయానికి సంబంధించిన స్థలంలో కొందరు వ్యక్తులు గత వారంలో కబ్జా చేయడానికి ప్రయత్నించగా ఆలయ కమిటీ తరపున అడ్డుకోవడం జరిగింది, ఈ విషయం మై స్థానిక శాసన సభ్యులు గంటా శ్రీనివాసరావు గారికి, విశాఖ జిల్లా కలెక్టర్ గారికి, విశాఖ జిల్లా DRO గారికి, విశాఖ రూరల్ (చినగదిలి) తహశీల్దార్ గారికి పిర్యాదు చేయడం జరిగింది, సదరు ఆలయం వెనుక భాగంలో ఉన్న స్థలం శతాబ్ది కాలం నుండి ఆలయం ఆధీనంలో ఉంది, సదరు స్థలంలో అమ్మవారి ఆలయానికి కార్యక్రమాలు అన్నియు నిర్వహించడం జరుగుతుంది, ఈ విషయం మై పిర్యాదు చేయగా అధికారులు, స్థానిక శాసన సభ్యులు పై విషయమై దర్యాప్తు చెయించి తగు న్యాయం చేస్తామని చెప్పారు. పై వారిని కలిసిన వారు ఆలయ కమిటీ అధ్యక్షులు పిల్లా కృష్ణమూర్తి పాత్రుడు, సెక్రటరీ మొల్లి లక్ష్మణరావు, సహాయ కార్యదర్శి కుడితి రామారావు, కోశాధికారి వాండ్రాసి అప్పలరాజు, పోతిన శివ లింగేశ్వర రావు, పిళ్లా అప్పన్న, యమ్.గణపతిరావు, ఇమంది బాబురావు, వాండ్రాసి సన్యాసిరావు, ఇమంది వెంకటరమణ, నమ్మి అప్పలస్వామి, పిళ్లా సూరిబాబు తదితరులు కలిసిన వారిలో ఉన్నారు.