భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శత జయంతోత్సవాలలో భాగంగా ఎంవివి సిటీలో రుద్రాభిషేకం. సాయి సెంటర్ బాధ్యులు రామకృష్ణ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు.

భగవాన్ శ్రీ సత్య సాయి దివ్య ఆశీస్సులతో స్వామి వారి శతజయంతోత్సవ వేడుకల్లో భాగంగా ఎంవివి సిటీ సాయి సెంటర్ బాధ్యులు రామకృష్ణ ఆధ్వర్యంలో ఎం వివి సిటీ లో గల 12 బ్లాక్ లలో ప్రతి బ్లాక్ నందు ఒక గంట పాటు రుద్ర పారాయణ(వేద పఠనం చేయుట జరిగినది) అన్ని బ్లాకులలో వేద పఠనం నకు ముగింపుగా 8వ బ్లాక్ లాబీ యందు స్వామి వారి రుద్రాభిషేఖం నిన్నటి దినం సోమవారం ఉదయం 9 గంటల నుండి 11 గంటల 30 నిమిషాలు వరకు ఎం వివి సిటీ వేదం గురువు రామినాయుడు పీఎం పాలెం సమితి వేదం గురువు మణి మంత్రోచ్ఛారణతో శ్రీమతి అండ్ శ్రీ టంకాల జ్యోతి శివాజీ నిర్వహణలో శాస్త్రోక్తంగా రుద్ర నమక చమకములతో అత్యంత వైభవంగా జరిగినది. ఈ రుద్రాభిషేకం కార్యక్రమంలో అన్ని బ్లాక్ లలో గల సాయి భక్తులు ఎంవివి సిటీ నివాసితులు పాల్గొని స్వామివారి ఆశీర్వాదములు తీర్థ, ప్రసాదములు సేకరించారు.