అంతర్జాతీయవాసవి క్లబ్ విశాఖ జిల్లా వి 2001 ఏ గవర్నర్ అమర్నాథ్ ఆధ్వర్యంలో సింహాచలం ఏరియా వాసవి క్లబ్ అధ్యక్షుడు భరత్ సహకారంతో సింహాచలం చందనోత్సవ భక్తులకు పులిహోర మజ్జిగ వితరణ.

అంతర్జాతీయ వాసవి క్లబ్స్ విశాఖ
జిల్లా వి201ఏ గవర్నర్ అమర్నాధ్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ సింహాచలం అధ్యక్షుడు భరత్ సహకారంతో శ్రీ వరహాలక్ష్మి నరసింహ స్వామి వారి దర్శనార్థం వచ్చిన భక్తులకు *చందనోత్సవం* సందర్భంగా 5000 మందికి పులిహోర మజ్జిగ వితరణ చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి చెరుకు కృష్ణ, ప్రాంతీయ అధికారిని శైలజ పాల్గొన్నారు. జి.సత్య,అప్పారావు,రజని,అరుణ మున్నగువారు కార్యక్రమంలో పాల్గొని వారి సహాయ సహకారాలు అందచేసినారు. ఈ సేవలో పాల్గొన్న వారందరికీ గవర్నర్ గారు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసినారు.