ఒక్క పాట కోసం చెన్నై వెళ్లిన సత్య సాయి భక్తులు.. సత్యసాయి పాటల్లో ఉన్న మాధుర్యం. స్వామి శత జయంతోత్సవాల్లో సుందరం మందిరంలో100 గంటల అఖండ నామ సంకీర్తనలు భాగంగా విశాఖ ఎంవిపి కాలనీ. ప్రేమ సదన్ మందిరం.సింగర్లు.
May 02, 2025
విశాఖ సిటీ,, ఎంవిపి కాలనీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను, సెల్ నెంబర్9502817542----------------------------
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న స్వామివారి శతజయంతోత్సవ వేడుకలలో భాగంగా చెన్నై (తమిళనాడు)లో *సుందరం* మందిరం నందు తలపెట్టిన 100 గంటల అఖండ నామ సంకీర్తనలో విశాఖపట్నం ఎంవిపి కాలనీ సిటీ సమితి *ప్రేమ సదన్* మందిరం సింగర్లకు అవకాశం ఇచ్చిన సందర్భంగా సిటీ సమితి నుండి విశాఖపట్నం జిల్లా సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు పి ఆర్ ఎస్ ఎన్ నాయుడు సిటీ సమితి కన్వీనర్ డి వి వి ఎస్ రాజు, 18 మంది సింగర్లు రెండు గంటల పాటు నామ సంకీర్తన చేసినారు. ఈ సందర్భంగా నామ సంకీర్తనలో పాల్గొనడానికి వచ్చిన స్వామివారి పూర్వపు విద్యార్థి ప్రఖ్యాత సింగర్ మరియు అద్భుతమైన కంపోజర్ శ్రీ టివి హరిహరన్ గారిని కలవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో శ్రీ సత్య సాయి సేవ సంస్థల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భజన్స్ కోఆర్డినేటర్ జి .శ్రీనివాసరావు, సిటీ సమితి భజన్స్ కోఆర్డినేటర్ లాల్ గారు, సింగెర్స్ శ్రీధర్ రాజా, వేణు గణపతి,సాయి స్వరూప్, వెంకట్రావు వెంకట రామకృష్ణారావు, డాక్టర్ ప్రతాప్, తబలా ఆర్టిస్ట్ గుప్త, మహిళా సింగర్స్ లావణ్య, గాయత్రి, సునీత, లలిత, జ్యోతి,ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.