ఎంవివి సిటీ. హైవే బస్ స్టాప్ వద్ద మజ్జిగ పంపిణీ. చలివేంద్రం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి సత్యసాయి సేవా సంస్థల విశాఖ జిల్లా అధ్యక్షులు పి ఆర్ ఎస్ ఎన్ నాయుడు. ఆధ్యాత్మిక సేవతో పాటు సామాజిక సేవ ఒక బాధ్యతగా తీసుకొని అందరూ పని చేయాలి. సత్యసాయి భగవానుడిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి... పి.ఆర్.ఎస్.ఎన్.🙏🏾
May 02, 2025
విశాఖ సిటీ, పీఎం పాలెం సమితి. ఎం. వి వి.సిటీ. భీమిలి నియోజకవర్గం. (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను.సెల్ నెంబర్.9502817542 )🙏🏾
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామివారి శతజయంతోత్సవ వేడుకల్లో భాగంగా ఎంవివి సిటీ శ్రీ సత్య సాయి సెంటర్ ఆధ్వర్యంలో ఎం వి వి సిటి జంక్షన్ దగ్గర గల బస్ స్టాప్ (బస్ బే) గురువారం ఉదయం చలివేంద్రం మజ్జిగ పంపిణీ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పి. ఆర్. ఎస్. ఎన్. నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలోఎండ తీవ్రత దృష్ట్యా పాదాచారులకు ఉపశమనం కలిగించే విధంగా
మే 1వ తేదీన గురువారం నుంచి 15.06.2025 వరకూ నిర్వహించడం జరుగుతుందని, తెలిపారు. అదేవిధంగా అనేక సేవా కార్యక్రమములు స్వామివారి 100వ జయంతోత్సవ áవేడుకలు సందర్భంగా జిల్లా అంతటా అన్ని మందిరాల్లో, భజన మండలిలలో జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఎం వి వి సిటీ శ్రీ సత్య సాయి సెంటర్ సాయి భక్తులు 45 రోజులు పాటు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందనీయం అని కొనియాడినారు. ఎవరు ఎంత సేవ చేస్తే ఆ సేవ వారికే దక్కుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. స్వామి ఆశయాలే ధ్యేయంగా ప్రతి ఒక్కరు పని చేయాలని కోరారు.. ఈ కార్యక్రమంలో సాయి సెంటర్ బాధ్యులు రామకృష్ణ, నిర్వాహకులు జ్యోతివెంకట శివాజీ , నాగవేణి వెంకటరామకృష్ణ రావు, రామినాయుడు, జయంతి ప్రసాద్, మల్లికార్జున రావు, శ్రీనివాసరావు , మానం శ్రీనివాసరావు, గౌతం, ప్రీతం, ముందుగా బస్ స్టాప్ లో నామ సంకీర్తన జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన దాతలకు, సేవలు అందిస్తున్న వారికి నిర్వాహకులు ధన్యవాదములు తెలిపినారు.