200 కిలోల గంజాయి పట్టుకున్న టాస్క్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్ పోలీసులు. వీరి సంయుక్త దాడులతో గంజాయి వ్యాపారుల నడ్డి విరుస్తున్న పోలీస్.. పెద్దఎత్తున సీజ్ చేసిన గంజాయి ప్యాకెట్లు. 🌹 శభాష్ పోలీస్🌹
May 13, 2025
200 కేజీల గంజాయి పట్టుకొన్న విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు.
విశాఖ/మధురవాడ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను( సెల్ నెంబర్.9502817542)
ఒడిస్సా కోరాపుట్ నుండి విశాఖపట్నంకి తరలిస్తున్న 200 కేజీల గంజాయిని విశాఖపట్నం టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను ఆదుపులోకి తీసుకున్నామని విశాఖ జాయింట్ పోలీస్ కమీషనర్ అజిత వేజెండ్ల, నార్త్ ఎసిపి ఎస్ అప్పలరాజు. మీడియాకి వెల్లడించారు.
ఒడిస్సా రాష్ట్రం కోరాపుట్ జిల్లాకి చెందిన రఘు హంటల్ (27), నరేంద్ర పంగి (28), బినియా మండల్ (30),రబింద్ర ఖిలా (24) అను వ్యక్తులు ఆనందపురం మీదుగా విశాఖలోని అజ్ఞాత ప్రాంతానికి బొలెరో వాహనం ద్వారా గంజాయిని తరలిస్తుండగా, కచ్చితమైన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు బోయపాలెం పైడా కాలేజీ జంక్షన్ వద్ద వీరిని ఆదుపులోకి తీసుకొని 200 కేజీల 40 పాకెట్స్ గంజాయిని వారి నుండి స్వాదీనం చేసుకొన్నారు. నిందుతుల నుండి ఒడిస్సా రిజిస్ట్రేషన్ గల బైక్ ని, ఏపీ రిజిస్ట్రేషన్ గల బొలెరో వాహనం, నాలుగు చరవాణులు కూడా స్వాదీనం చేసుకొన్నామని తెలిపారు. ఎన్డిపిఎస్ యాక్ట్ క్రింద కేసు నమోదు చేసామని రిమాండ్ కి తరలించి రేపు కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ సీఐ ఎస్ భాస్కర రావు, ఆనందపురం ఎస్ ఐ జి సంతోష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.