సింహాచలం గోడ కూలినప్రమాదంలో మృతుల బాధిత కుటుంబాల ఒక్కొక్కరికి25 లక్షల రూపాయలు నష్టపరిహారం అందజేసిన జాయింట్ కలెక్టర్ మయూర

ఎక్స్ గ్రేషియా చెక్కులు అందజేత _మధురవాడ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ :(సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను ) చందనోత్సవం రోజున సింహాచలం కొండపై గోడ కూలిన దుర్ఘటనలో మరణించిన ముగ్గురు భీమిలి నియోజవర్గం వాసుల కుటుంబాలకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజ ఆదివారం నష్ట పరిహారం చెక్కులను ఆదివారం అందించారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న చంద్రంపాలేనికి చెందిన పిల్లా ఉమా మహేష్, శైలజ దంపతుల కుటుంబీకులకు, అడవివరానికి చెందిన స్టీల్ ప్లాంట్ ఉద్యోగి యడ్ల వెంకట్రావు కుటుంబానికి ఒకొక్కరికి రూ.25 లక్షల ప్రభుత్వ సాయాన్ని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ తో కలిసి అందజేశారు. గోడ కూలి ఏడుగురు మరణించడం విచారకరమని, బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా రవితేజ పేర్కొన్నారు. కార్యక్రమంలో భీమిలి ఆర్డీఓ కె.సంగీత్ మాధుర్, పార్టీ నాయకులు పిల్లా వెంకట్రావు, పి.వి.నరసింహం, లొడగల అప్పారావు, నాగోతి సత్యనారాయణ, సోంబాబు, గరే గుర్నాథ్, పంచదార్ల శ్రీనివాస్, గుసిడి శంకర్రావు, జానకిరామ్, అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు.