ఘనంగా వాసవి మాత జయంతి. ప్రత్యేక పూజలు.

విశాఖ సిటీ, (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ.) ఘనంగా వాసవి మాత జయంతి. 🙏🏾🌹🌹🌹🌹🙏🏾 వాసవీ మాత. 1021 వ జయంతి పర్వదిన సందర్భముగా తేది.*07-05-2025* న మాఘశుద్ధ దశమి బుధవారం వాసవి క్లబ్, ఎం.వి.పి.కపుల్స్ ఆధ్వర్యంలో ఉపాధ్యక్షుడు వాసవియన్ కాపుగంటి సీతామహాలక్ష్మి శ్రీనివాసరావు స్వగృహమునందు వాసవి పూజ , మణిద్వీప వర్ణన పారాయణం 32 మంది మహిళలచే తొమ్మిది రకముల పుష్పములతో తొమ్మిది సార్లు మొత్తముగా 9,216 పుష్పములతో వాసవి మాతకు పూజా కార్యక్రమంచేసి తదనంతరం, ప్రసాద వితరణ చేశారు.. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఏవి రామకృష్ణారావు, కార్యదర్శి వెంకటరమణమూర్తి, కోశాధికారి చంద్రశేఖర్ గుప్తా, ప్రోగ్రాం కోఆర్డినేటర్ శివరామకృష్ణ, వి 201ఏ విశాఖపట్నం జిల్లా గవర్నర్ తమ్మన అమర్నాథ్, మానస, క్యాబినెట్ సెక్రటరీ సాయి నిర్మల, క్యాబినెట్ ట్రెజరర్ చెరుకు కృష్ణ, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ వాసుదేవ మూర్తి , రీజన్ చైర్ పర్సన్ ఆదిమూలం తిరుపతిరావు, రీజియన్ సెక్రటరీ పుష్పలత, జోన్ చైర్ పర్సన్ కమల్ కుమార్, క్లబ్ సభ్యులు హరగోపాల్, నర్సింగరావు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు