వాసవి క్లబ్ సేవలు అమోఘం

వాసవి ప్రాంతీయ అధికారి అధికారిక పర్యటన. విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ.( సెల్ నెంబర్ 9502817542) వాసవి క్లబ్ ప్రాంతీయ అధికారి తిరుపతి రావు తమ అధికారిక పర్యటనలో భాగంగా ఎం.వి.పి.కపుల్స్ క్లబ్ ను సందర్శించి క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాల పట్ల సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఇంకా అవసరమైన వారికి సేవలు విస్తృత పరచాలని కోరారు.ఇంకనూ అంతర్జాతీయ వాసవి క్లబ్స్ చేపడుతున్న వివిధ రకాల స్కీమ్స్ గురించి తెలియచేశారు. సేవా కార్యక్రమాలలో భాగంగా ఒక చిరు వ్యాపారి అయిన శ్రీ కుసుమంచి సూర్యారావు గారికి వ్యాపారాభివృద్ధికై రూపాయలు 20,000/-చెక్కు ద్వారా అందచేసారు. వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను మరింత ప్రోత్సహించడానికి శ్రీ కాపుగంటి గోపాలకృష్ణ అవసరం ఉన్నచోట ఆర్వో ప్లాంట్ నిమిత్తం 50 వేల రూపాయలు ప్రకటించినారు. తిరుపతి రావు కి క్లబ్ సభ్యులు శాలువాతో సత్కరించినారు.ఈ కార్యక్రమంలో ప్రాంతీయ కార్యదర్శి పుష్పలత, జోన్ చైర్మన్ కమల్ కుమార్,క్లబ్ అధ్యక్షుడు వెంకట రామకృష్ణారావు,కార్యదర్శి వెంకట రమణ మూర్తి కోశాధికారి చంద్రశేఖర్ గుప్తా,చార్టర్ అధ్యక్షులు చెరుకు కృష్ణ, అంతర్జాతీయ కార్యక్రమాల సమన్వయ కర్త వాసుదేవ మూర్తి, కార్యక్రమాల ఛైర్పర్సన్ శివరామకృష్ణ, ఉపాధ్యక్షుడు శ్రీ నివాసరావు ,హరగోపాల్, గోగుల నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.