జాతర గట్టు దుర్గాలమ్మ ఆలయం వద్ద మజ్జిగ పంపిణీ. ఆలయ కమిటీ అధ్యక్షుడు పిల్లా సూరిబాబు సెక్రెటరీ తాతారావు
May 11, 2025
(ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను)
విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రంపాలెం జాతర శ్రీదుర్గాలమ్మ ఆలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో మీసాల నర్సింగరావు ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన మజ్జిగను ఆదివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోశ్రీ దుర్గాలమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులు పిల్లా సూరిబాబు సెక్రటరీ నాగోతి తాతారావు సభ్యులు పోతిన పైడిరాజు, పొట్నూరి హరికృష్ణ, పిళ్లా పోతరాజు, పి.రవి, పోతిన రాంబాబు, పద్మశాలి ఆత్మీయ సేవా సంఘం అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు, మజ్జిగ ధాత మీసాల నర్సింగరావు, జాయింట్ సెక్రటరీ బేతా ఆప్పన్న కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.నాగేశ్వరరావు, పప్పు సత్య రామస్వామి, కాదూరి శ్రీరాములు, బి.పాండురంగ విఠల్, అమ్మవారి సేవకులు గుప్తా తదితరులు ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రారంభించి పంపిణీ చేయడం జరిగింది,
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ శ్రీదుర్గాలమ్మ అమ్మవారి ఆలయానికి వచ్చిన భక్తులు, రోడ్ల పై ప్రయాణాలు చేసే బాటసారులు, వాహనదారులు ఎండ వేడికి, ఉక్కపోతకు గురైన వారందరూ చలివేంద్రంలో చల్లని మజ్జిగ సేవించి వారి వారి ప్రయాణాలు సాగిస్తున్నారని తెలిపారు.