వాసవి క్లబ్ కపుల్స్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో అన్నదానం.. దాన్ని ప్రారంభిస్తున్న క్లబ్ అధ్యక్షుడు రామకృష్ణ

విశాఖ సిటీ( ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ.) విశాఖ,పెదవాల్తేరు, దళాయి వారి వీధి నందు IRCS నిర్వహణలో నడుస్తున్న పురుషుల నిరాశ్రయులైన వసతి గృహమునందు వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ఆధ్వర్యంలో పల్లపోతు హరగోపాల్, నాగమణి ల మనవరాలు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా వయోవృద్ధులకు భోజన సదుపాయం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఏవి రామకృష్ణారావు, ఉపాధ్యక్షులు కాపుగంటి శ్రీనివాసరావు, కోశాధికారి పి చంద్రశేఖర్ గుప్తా క్లబ్ సభ్యులు పి హరి, గోపాల్, పి నాగమణి, తదితరులు పాల్గొన్నారు.