రేపు ఆర్వో ప్లాంట్ ప్రారంభోత్సవానికి అంతర్జాతీయ వాసవి క్లబ్ అధ్యక్షుడు. ఇరుకుల్ల రామకృష్ణ.

ఆర్వో ప్లాంట్ ప్రారంభోత్సవానికి అంతర్జాతీయ వాసవి క్లబ్ అధ్యక్షులు కి ప్రత్యేక ఆహ్వానం. విశాఖ సిటీ, (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను ) వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో 11.05.2025 ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు వెంకోజీపాలెం ,సెక్టార్ 6 నందు శిరిడి సాయి మందిరంలో ఆర్వో ప్లాంట్ ప్రారంభోత్సవం చేస్తామని క్లబ్ అధ్యక్షుడు రామకృష్ణ శనివారం తెలిపారు. . ఈ ఆర్ వో ప్లాంట్ ప్రారంభోత్సవం వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షులు శ్రీ ఇరుకుల్ల రామకృష్ణ చేతుల మీద ప్రారంభోత్సవం జరుగుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు అనంతపల్లి వెంకటరామకృష్ణారావు విశాఖలో ప్రముఖ హోటల్లో బస చేసిన అంతర్జాతీయ అధ్యక్షులు వారికి కలసి సాలువతో సత్కరించి ఆర్ఓ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించినారు. ఆహ్వానించిన వారిలో క్లబ్ చార్టర్ అధ్యక్షులు, క్యాబినెట్ కోశాధికారి చెరుకు కృష్ణ, క్లబ్ సభ్యులు అంతర్జాతీయ వాసవి క్లబ్ ఉపాధ్యక్షులు వేద మధుసూదన్ , జిల్లా గవర్నర్ తమ్మన అమర్నాథ్, క్యాబినెట్ కార్యదర్శి సాయినిర్మల ఉన్నారు ఈ ప్రారంభోత్సవానికి క్లబ్ సభ్యులు అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా క్లబ్ అధ్యక్షులు కోరినారు.