బొబ్బిలి మండలం గొల్లపల్లిలో శ్రీ శ్రీ శ్రీదాడి తల్లి అమ్మవారి సినిమానోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన చిన్న శ్రీను సోల్జర్ అధ్యక్షురాలు సిరమ్మ.
May 06, 2025
భీమిలి నియోజకవర్గం (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను పాత మధురవాడ మెట్ట.9502817542)
శ్రీ శ్రీ శ్రీ దాడితల్లి అమ్మవారి సిరిమనోత్సవం కార్యక్రమంలో సిరి సహస్ర (సిరమ్మ).
బొబ్బిలి మండలం, గొల్లపల్లి లో మంగళవారం నాడు శ్రీ శ్రీ శ్రీ దాడితల్లి అమ్మవారి సిరి మానోత్సవం సందర్భంగా చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర (సిరమ్మ) దర్శించి, పట్టు వస్త్రములు సమర్పించారు. ముందుగాఉత్సవ కమిటీ సభ్యులు సిరమ్మకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వేదమంత్రాలతో ఆలయ పూజార్లు సిరమ్మను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శ్రీ సంభంగి వెంకట చిన్నప్పలనాయుడు గారు, చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోటవాసు, ఉత్సవ కమిటీ సభ్యులు, సోల్జర్ సభ్యులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.