పంతం నెగ్గించుకున్న భారత్, పాక్ టెర్రరిజం అంతం . ప్రపంచ టెర్రరిజానికి తగిన గుణపాఠం చెప్పిన మోడీ...... ఎక్స్ మినిస్టర్ అవంతి శ్రీనివాస్.
May 08, 2025
భారత్ పంతం పాక్ టెర్రరిజం అంతం
భీమిలి నియోజకవర్గం
(ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ );
త్రివిద దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయ వంతం చేసినందుకు త్రివిద దళాలు కు మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు.
ఆపరేషన్ సిందూర్ పై ఆయన స్పందిస్తూ పెహల్గాం అమాయక ప్రజల పై మతం అడిగి మరీ విచక్షణా రహితంగా కాల్పులు జరిపి చంపి భారత స్త్రీలతో వెళ్ళి మోదీ కి చెప్పుకోండి అని అనడంతో తమ భర్తలు ను కోల్పోయిన భార్యలు వెళ్ళి మోదీ కి చెప్పడం .భారత ప్రధాని మోదీ మేము టెర్రరిజం కి వ్యతిరేకం మా యుద్దం పాకిస్థాన్ దేశంతోనో, పాలకులు తో, ప్రజలు తో, కాదు అని, మా యుద్దం ప్రపంచానికి పట్టిన టెర్రరిజం అనే భూతం తో అని, వారు చేసిన దాడి ఘటనకు ప్రతి స్పందన గా "ఆపరేషన్ సిందూర్" పేరిట పాక్ ఆక్రమిత కాశ్మీర్లో టెర్రరిస్టులు ఏర్పాటు చేసుకున్న, 9 క్యాంప్ లపై వైమానిక దాడులు జరిపి 100 మంది టెర్రరిస్టులతో పాటు వారి ఉగ్రవాద కార్యకలాపా స్థావరాలను ధ్వంసం చేయడం జరిగింది.మన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి - దేశ ప్రజలను రక్షించుకోవాలి, అంటే ఇలాంటి కఠినమైన చర్యలు తప్పకుండా భవిష్యత్తు లో కూడా తీసుకోవాలని, టెర్రరిజం పై పోరాటంలో దేశం అంతా ఓకె తాటిపై నిలిచి అండగా నిలబడటం గర్వించదగ్గ విషయం అని పేర్కొన్నారు.