చార్టర్డ్ అకౌంటు డే సందర్భంగా వాసవి క్లబ్ కపుల్స్ ఆధ్వర్యంలో ఎంవిపి కపుల్స్ అధ్యక్షుడు రామకృష్ణ సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ వాసుదేవ మూర్తికి ఘన సన్మానం.

.విశాఖ సిటీ,మధురవాడ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను ) వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ లో భాగంగా మంగళవారం జులై 1 ,2025 చార్టర్డ్ అకౌంటెంట్ డే ను పురస్కరించుకొని ఎంవిపి కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ కపుల్స్ సభ్యులైన వాసవియన్ సిల్వర్ స్టార్ కే సి జి ఎఫ్ గ్రంధి వాసుదేవ మూర్తి కి (అంతర్జాతీయ కార్యక్రమాల సమన్వయకర్త) వారి గృహ మందు చార్టర్డ్ అకౌంటెంట్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సాలువతో వాసుదేవ మూర్తి దంపతులను సత్కరించారు.. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు వాసవియన్స్ వెంకట రామకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి వెంకటరమణమూర్తి కోశాధికారి చంద్రశేఖర్ గుప్తా, ప్రోగ్రాం కోఆర్డినేటర్ పాలూరి శివరామకృష్ణ, ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు మరియు చార్టర్ ప్రెసిడెంట్ వాసవియన్ చెరుకు కృష్ణ పాల్గొన్నారు.