పారిశుధ్య కార్మికులను తల్లికి వందనంలో చేర్చాలి. వారి బకాయి జీతాలు చెల్లించాలి -- సిఐటి యు నేతఅప్పలరాజు డిమాండ్.
June 26, 2025
జీతాలు వెంటనే విడుదల చేయండి.
తల్లికి వందనం వర్తింప చేయాలి..
మధురవాడ, (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను )
రెండు నెలలు పూర్తీ కావస్తున్న మున్సిపల్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు జీతాలు నేటికీ ఇవ్వకపోవడం అన్యాయమని సీ ఐ టీ యు జోన్ కమిటీ అధ్యక్షులు డి అప్పలరాజు అన్నారు.వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఐదు నుండి ఎనిమిదోవ వార్డు వరకు,ఆయా కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు.ఈ సందర్భంగా జీ వి ఎం సి జోనల్ 2 కార్యాలయం వద్ద జరిగిన నిరసన లో డీ అప్పలరాజు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు నెలలు కాలం పూర్తి కావస్తున్న ఇప్పటి వరకు వేతనాలు ఇవ్వకపోతే ఎలా జీవిస్తారని ప్రశ్నించారు. పెరిగిన ధరలతో ఇప్పటికే వేతనాలు చాలక ఇబ్బందులు పడుతున్నా కార్మికులు ఇస్తున్న ఆ మాత్రం జీతాలు కూడా సమయానికి విడుదల చేయక పోవడం అన్యాయమని అన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో అనేక ఖర్చులుంటాయని,మరో వైపు ఆరోగ్య సమస్యలు,అప్పులకు వడ్డీలు కట్టవలసి ఉంటుందని తెలియ చేసారు.ఔట్ సోర్సింగ్,కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ ఉద్యోగులతో పోల్చి,తల్లికి వందనం పథకం ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు.తల్లికి వందనం పథకం లో మున్సిపల్ కార్మికులను లబ్ధిదారులుగా చేర్చాలని డైమండ్ చేశారు.ఔట్ సోర్సింగ్ విభాగంలో మున్సిపల్ కార్మికుల కు ఇచ్చిన హామీ మేరకు ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలనీ కోరారు.ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 30 న మున్సిపల్ ప్రధాన కార్యాలయం వద్ద భారీ ఎత్తున ముట్టడి కార్యక్రమం జరుగుతుంది అని తెలియ చేసారు.కార్మికులు పెద్దయెత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బి నరసింగరావు,టీ జాన్,బాలకృష్ణ,కే అచియ్యమ్మ,ఎం రమణ,ఆర్ కొండమ్మా,బి దుర్గా,సురేష్ తదితరులు పాల్గొన్నారు.