ప్రిజం కాలేజీలో ఓ బి టి ఎస్ ప్రోగ్రాం ( ఆఫీస్ బేరర్స్ ట్రైనింగ్ సెమినార్) ను ముఖ్య అతిథి పైలట్ ఫ్యాకల్టీగా విజయవాడకు చెందిన వాసవి క్లబ్ అంతర్జాతీయ కార్పొరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఉపాధ్యక్షులు వాసవి ఎన్ గోల్డెన్ స్టార్ కె సి జి ఎఫ్ శ్రేయోభిలాషి సిఏ. ఎంవిఎన్. రామచందర్రావు జ్యోతి ప్రజ్వలన.. చేసి ప్రారంభోత్సవం.

విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ :( సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) వాసవి... తేదీ 26.01.2025 సోమవారం ఉదయం 10 గంటలకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, వి 201 ఏ విశాఖపట్నం జిల్లా గవర్నర్ వాసవియన్ విద్యాసంకల్ప స్టార్ కేసీజిఎఫ్ శ్రేయోభిలాషి శ్రీమతి వంకాయల సాయినిర్మల గారి ఆధ్వర్యంలో స్థానిక
*ప్రిజమ్ కాలేజి* నందు *ఓ బీ టీ ఎస్* ప్రోగ్రాం (ఆఫీస్ బేరర్స్ ట్రైనింగ్ సెమినార్)నిర్వహించినారు.ముఖ్యఅతిథి మరియు పైలట్ ఫ్యాకల్టీ గా హాజరైన విజయవాడ వాస్తవ్యులు వాసవి క్లబ్ అంతర్జాతీయ కార్పొరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఉపాధ్యక్షులు వాసవియన్ గోల్డెన్ స్టార్ కె సి జి ఎఫ్ శ్రేయోభిలాషి సిఎ.ఎంవీఎన్..రామచంద్రరావు గారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించి 2026 వ సంవత్సరం అంతర్జాతీయ అధ్యక్షులు వాసవియన్ సౌభాగ్య సేవా సంకల్ప సిద్ధ సూర్యప్రకాశరావు గారు ప్రస్తుత సంవత్సరం థీమ్... హిస్టరీగా, ప్రోగ్రాం... విక్టరీగా భావించి తన 65 వ జన్మదినోత్సవం సందర్భంగా 65 కార్యక్రమములు చేయుటకు తలపెట్టినారని, ఆ కార్యక్రమంలో వివరములు తెలియజేసినారు. కో. ఫ్యాకల్టీ సభ్యులుగా వాసవియన్స్ వేద మధుసూదన్,తమ్మన అమర్నాథ్, డి వీ ఎస్ రామారావు పాల్గొన్నారు. ప్రత్యేకించి వివిధ క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శులు మరియు కోశాధికారులకు నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమానికి ఏడు రీజియన్లకు సంబంధించిన చైర్ పర్సన్స్ ఆతిథ్యం ఇవ్వగా 150 మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో ,క్యాబినెట్ ప్రధాన కార్యదర్శి వాసవియన్ పద్మావతి , క్యాబినెట్ కోశాధికారి వాసవియన్ చెరుకు కృష్ణ , సేవా విభాగపు కార్యదర్శి రమణి, వాసవియన్ గ్రంధి వాసుదేవ మూర్తి, రీజియన్ టు చైర్ పర్సన్ వాసవియన్ తమ్మన మానస, జోన్ 2 చైర్పర్సన్ వాసవియన్ వెంకట రామకృష్ణారావు, వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ అధ్యక్షుడు వెంకటరమణమూర్తి, కార్యదర్శి చంద్రశేఖర్ గుప్త, కోశాధికారి నర్సింగరావు, వైస్ గవర్నర్స్,వివిధ రీజనల్ చైర్ పర్సన్స్ , రీజియన్ సెక్రటరీస్, జోన్ చైర్ పర్సన్స్ పాల్గొన్నారు.