గురువారం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు
July 03, 2025
సతీ సమేతంగా సింహాచలం వరహా లక్ష్మి నరసింహ స్వామీ సన్నిధిలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు.
విశాఖ సిటీ (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను)
మధురవాడ
భీమిలి నియోజకవర్గం (సింహాచలం) - గురువారం
మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జ్ఞానేశ్వరి దంపతులు గురువారం సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం అర్చకులు, ఉద్యోగులు ఆ పుణ్య దంపతులకు సాదర స్వాగతం పలికి వేదమంత్రోచ్ఛారణల తో వారిని ఆశీర్వదించారు. స్వామి దర్శనానంతరం
శ్రీ వరహా లక్ష్మి నరసింహ స్వామి వారి సన్నిధిలో కప్ప స్తంభం అలింగనం చేసుకొని స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. మొక్కును తీర్చుకున్నారు. సింహాద్రి అప్పన్న పై అమితమైన భక్తి, విశ్వాసం ఉన్న ఆయన దేవస్థానానికి వస్తూ ఉంటారు. ప్రతి శనివారం దర్శించుకునే ఆయన ఈసారి గురువారం ప్రత్యేకంగా స్వామిని దర్శించుకున్నారు.