ఎంవిపి వాసవి క్లబ్ కపుల్స్ ఆధ్వర్యంలో హోమియో డాక్టర్ రామేశ్వర్ కు ఘన సన్మానం. .
July 04, 2025
విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్,: (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను ) గత 35 సంవత్సరముల నుండి నిస్వార్థ ఉచిత హోమియో వైద్య సేవలను అందిస్తున్న "మాస్టర్ హోమియో వైద్యాలయం" లాసన్స్ బే కొలనీ లో గల ప్రసిద్ధ హోమియో వైద్యులు డాక్టర్ రామేశ్వర్ రోగులకు చేస్తున్న ఉచిత నిస్వార్థ వైద్య సేవలను గుర్తిస్తూ వాసవి క్లబ్ ఎం.వి.పి.కపుల్స్ సభ్యులు దుశాలువతో ఘనంగా సత్కరించిరి. వారితో పాటు 8 మంది కార్యకర్తలను కూడా సత్కరించటం జరిగింది. ఈ సందర్భంగా. కార్యకర్త స్వామి మాట్లాడుతూ ఈ వైద్యాలయం 35 సంవత్సరములనుంచి రోగులకు ఉచిత వైద్య సేవలతో పాటు ఉచితంగా హోమియో మందులను కూడా అందచేస్తున్నట్లు తెలిపారు. మా సేవలను గుర్తిస్తూ సన్మానం చేయుటవలన మాకు మరింత బాధ్యత పెరిగింది అని తెలియచేశారు. డాక్టర్ రామేశ్వర్ మాట్లాడుతూ సమాజానికి వాసవి క్లబ్స్ చేస్తున్న సాంఘీక, సామాజిక . సంక్షేమ సేవా కార్యక్రమాలు యేనలేవని కొనియాడారు. ఈ కార్యక్రమం లో క్లబ్ అధ్యక్షుడు వాసవియన్ వెంకట రామకృష్ణ రావు, చార్టర్ అధ్యక్షుడు వాసవియన్ చెరుకు కృష్ణ,క్లబ్ సభ్యురాలు వాసవియన్ కృష్ణకుమారి, కార్యకర్తలు తదితరులు పాల్గున్నారు..