డిసెంబర్ 7న ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కార్తీక మాసం వన సమారాధన వేదిక. శిల్పారామం జాతర... జాతీయ జర్నలిస్టు సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు..

7 న ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ వన సమారాధన ( విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ) మధురవాడ జాతరలో నిర్వహణ *ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక కార్యక్రమాలు* *మహిళలకు చీరలు పంపిణీ పిల్లలకు ప్రత్యేక బహుమతులు* *కనువిందు చేయనున్న సాంస్కృతిక కార్యక్రమాలు* *జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల* అక్కయ్యపాలెం జంక్షన్. నవంబర్ 25 ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్.. బ్రాడ్ కాస్ట్ ..స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ల ఆధ్వర్యంలో డిసెంబర్ 7న వర్కింగ్ జర్నలిస్టుల వన సమారాధన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణలు తెలిపారు.. మంగళవారం ఇక్కడ అక్కయ్యపాలెం జంక్షన్ లోని ఒక ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన యూనియన్ ల కార్యవర్గ సమావేశంలో వన సమారాధన తో పాటు పలు అంశాలపై సభ్యులంతా చర్చించారు ..ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు, నారాయణ లు మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యుల కోసం వన సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు . మధురవాడ జాతరలో 7 న ఉదయం 9 గంటల నుంచి అల్పాహారం ప్రారంభమవుతుందన్నారు. ఆ తర్వాత కనువిందు చేయనున్న సాంస్కృతి కార్యక్రమాలు.. అతిథులు ప్రసంగాలు ..మహిళలకు చీరలు పంపిణీ.. పిల్లలకు బహుమతులు ఇలా అనే కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.. మధ్యాహ్నం విందు భోజనం ఏర్పాటు చేశామన్నారు. ఆ రోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ప్రత్యేకంగా బస్సు సదుపాయం కల్పించామన్నారు. కావున ఈ వన సమారాధనలో జర్నలిస్టులు ,వారి కుటుంబ సభ్యులు పాల్గొని జయప్రదం చేయాలని వీరు పిలుపునిచ్చారు.. జర్నలిస్టుల సంక్షేమం కోసం తమ వంతు పాటు పడుతూనే మరోవైపు ఉగాది.. దసరా.. దీపావళి వంటి పండుగలు కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు.. ఈ సమావేశంలో ఫెడరేషన్ విశాఖ జిల్లా కార్యదర్శి జి.శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏ సాంబశివరావు, బ్రాడ్ కాస్ట్ అధ్యక్షులుఇ. ఈశ్వరరావు.. కార్యదర్శి మదన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ ఆయా యూనియన్లో కార్యవర్గ ప్రతినిధులు ప్రసాద్, కిషోర్, కామన్న.. కె.వి శర్మ కృష్ణమూర్తినాయుడు ,, పక్కి వేణు గోపాల్, పిల్లా నగేష్ బాబు ....రాజశేఖర్, కామన్న పి..నాగేశ్వరరావు తదితరులంతా పాల్గొన్నారు