వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో ఎండాడ వైశాకిస్కై పార్క్ గేటెడ్ కమ్యూనిటీలో క్లబ్ అధ్యక్షులు వాసవియన్ వెంకటరమణమూర్తి నిర్వహణలో జోన్ 2 చైర్ పర్సన్ రామకృష్ణారావు నివాస ప్రాంతంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు, గాలిపటాలు ఎగరవేత, ముగ్గులు పోటీలు, సంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.
January 15, 2026
జై వాసవి... జై జై వాసవి...
విశాఖ సిటీ, (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ :సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)
వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్
ఆధ్వర్యంలో
తేదీ 15.01.2025 గురువారం నాడు సాయంత్రం 5 గంటలకు సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి సంబరాలు క్లబ్బు అధ్యక్షులు వాసవియన్ వెంకటరమణమూర్తి గారి నిర్వహణలో ఎండాడలో గల వెంకట రామకృష్ణారావు గారు జోన్ 2 చైర్ పర్సన్ నివాసం ఉంటున్న వైశాఖి స్కై పార్క్ గేటెడ్ కమ్యూనిటీ నందు సభ్యులు సామూహికంగా కలసి ఘనంగా నిర్వహించినారు. సభ్యులందరూ ఒకరికి ఒకరు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకొని మహిళలు ముగ్గులు వేయడంలోనూ, పురుషులు (పతంగులు) గాలిపటములు ఎగురవేయడంలోని తమ తమ ఆనందాల్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ చార్టర్ అధ్యక్షులు మరియు క్యాబినెట్ కోశాధికారి చెరుకు క్రిష్ణ, ప్రోగ్రాం చైర్మన్ పాలూరి శివరామకృష్ణ,పూర్వపు అధ్యక్షులు మల్లేశ్వర గుప్తా, గ్రంధి కృష్ణారావు, బుడ్డెపు రామారావు, గోగుల నర్సింగరావు, సన్యాసయ్య శెట్టి ( సింహాచలం ),పూసర్ల సూర్యారావు,క్లబ్ మహిళా సభ్యులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో 8 మంది పూర్వపు అధ్యక్షులు ఒకే సారి కలవటం ఒక ప్రత్యేక ఆకర్షణ గా ఉందని చెరుకు కృష్ణ గారు తన సంతోషాన్ని వ్యక్తం చేసినారు.


